AP మహిళ శిశు సంక్షేమశాఖ బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ | AP Latest jobs Notifications | Latest jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత కార్యాలయం యొక్క మిషన్ వాత్సల్య నందు కాంట్రాక్ట్ ప్రాధిపాతికన పని చేసేందుకు  వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ ద్వారా సోషల్ వర్కర్ , ఔట్రీచ్ వర్కర్, మేనేజర్ / కోఆర్డినేటర్ , డాక్టర్, ఆయా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

జిల్లా మహిళ  మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత కార్యాలయం , అల్లూరి సీతారామరాజు నుండి ఈ నోటిఫికేషన్ ప్రకటించబడింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 

అన్ని విభాగాలలో కలిపి మొత్తం 7 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : 

సోషల్ వర్కర్స్ – 01

ఔట్రీచ్ వర్కర్ – 01

మేనేజర్/ కోఆర్డినేటర్ – 01

డాక్టర్ – 01

ఆయా – 03

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 విద్యార్హత : 

సోషల్ వర్కర్స్ : డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి. సోషల్ వర్క్ / సోషియాలజీ / సోషల్ సైన్సెస్ లో డిగ్రీకి ప్రాధాన్యత లభిస్తుంది.పని అనుభవంకు వెయిటేజ్ లభిస్తుంది. కంప్యూటర్ పరిజ్ఞానం వుండాలి.

ఔట్రీచ్ వర్కర్ : గుర్తింపు పొందిన సంస్థ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి వుండాలి.పని అనుభవం కు వెయిటేజ్ లభిస్తుంది.

మేనేజర్/ కోఆర్డినేటర్ : సోషల్ వర్క్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్/ సైకాలజీ లో మాస్టర్స్ , హోమ్ సైన్సెస్ లో MSc ఉత్తీర్ణత సాధించాలి. మరియు 3 సంవత్సరాలు అనుభవం కలిగి వుండాలి.

డాక్టర్ : MBBS ఉత్తీర్ణత సాధించి, పెడియాట్రిక్స్ మెడిసిన్ లో స్పెషలైజేషన్ చేసి వుండాలి.

ఆయా : తల్లులు & పిల్లల సంరక్షణ లో 6 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.

🔥  వయస్సు :

25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు నిర్ధారణ కొరకు తేది ను 01/07/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

🔥 దరఖాస్తు విధానం :

అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన ఫార్మేట్ ను ఫిల్ చేసి సంబంధిత ధ్రువపత్రాలను జత చేసి, కార్యాలయ చిరునామాకు పోస్ట్ ద్వారా లేదా నేరుగా అందచేయాలి.

🔥 దరఖాస్తు తో పాటు అవసరమగు ధృవ పత్రాలు :

నోటిఫికేషన్ లో ప్రస్తావించిన అన్ని ధృవ పత్రాలు అనగా విద్యార్హతలు , కులం, పుట్టిన తేదీ నివాసం మొదలగు పత్రములను స్వీయ ధ్రువీకరణ చేసి జత పరచవలెను.

🔥దరఖాస్తు అందచేయవలసిన చిరునామా :

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి , తలారసింగి, బాలసదనం ప్రక్కన, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా. Pin.No: 531024.

🔥 ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ కాబడిన వారికి మౌఖిక ఇంటర్వ్యూ నిర్వహించి ,ఎంపిక చేస్తారు.

🔥 జీతం :

సోషల్ వర్కర్ గా ఎంపిక కాబడిన వారికి నెలకు 18,536 రూపాయలు నెలకు జీతం లభిస్తుంది.

ఔట్రీచ్ వర్కర్ గా ఎంపిక కాబడిన వారికి 10,592/- రూపాయలు నెలకు జీతం లభిస్తుంది.

మేనేజర్ / కోఆర్డినేటర్ గా ఎంపిక కాబడిన వారికి 23,170/- రూపాయలు నెలకు జీతం లభిస్తుంది.

డాక్టర్ (పార్ట్ టైమ్) గా ఎంపిక కాబడిన వారికి 9930/- రూపాయలు నెలకు జీతం లభిస్తుంది.

ఆయా గా ఎంపిక కాబడిన వారికి 7,944/- రూపాయలు  నెలకు జీతం లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు :

దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 02/04/2025

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది:16/04/2025.

👉  Click here to download notification & Application 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!