ఆంధ్రప్రదేశ్ మహిళ మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP WDCWD Jobs Recruitment 2025 | AP Contract Basis Jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మహిళ  మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత కార్యాలయం నందు ఏర్పాటు చేయబడిన వన్ స్టాప్ సెంటర్ నందు కాంట్రాక్ట్ ప్రాధిపాతికన పని చేసేందుకు  వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ ద్వారా సైకో సోషల్ కౌన్సిలర్ , మల్టీ పర్పస్ స్టాఫ్ / కుక్, సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్ ఉద్యోగ భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు,దరఖాస్తు విధానం,ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

జిల్లా మహిళ  మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత కార్యాలయం , అల్లూరి సీతారామరాజు నుండి ఈ నోటిఫికేషన్ ప్రకటించబడింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య: 

అన్ని విభాగాలలో కలిపి మూడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

సైకో సోషల్ కౌన్సిలర్ – 01 (జనరల్)

మల్టీ పర్పస్ స్టాఫ్/ కుక్ – (ఎస్సీ)

సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్ –  (ఎస్సీ)

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 విద్యార్హత: 

సైకో సోషల్ కౌన్సిలర్ (మహిళ): సైకాలజీ సైకోమెట్రీ లేదా న్యూరో సైన్స్ విభాగాలలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత లభిస్తుంది.

మల్టీ పర్పస్ స్టాఫ్/ కుక్: హై స్కూల్ ఉత్తీర్ణత/ తత్సమాన అర్హత కలిగిన వారు, వివిధ పనులను చేసిన అనుభవం కలిగి వుండాలి.

సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్: ఏదైనా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన సంస్థ లో సెక్యూరిటీ పర్సనల్ గా 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి వున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిటైర్డ్ మిలిటరీ/ పారా మిలిటరీ  అభ్యర్థులకు ప్రాధాన్యత లభిస్తుంది.

🔥  వయస్సు :

25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు నిర్ధారణ కొరకు తేది ను 01/07/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన ఫార్మేట్ ను ఫిల్ చేసి సంబంధిత ధ్రువపత్రాలను జత చేసి, కార్యాలయ చిరునామాకు పోస్ట్ ద్వారా లేదా నేరుగా అందచేయాలి.

🔥 దరఖాస్తు తో పాటు అవసరమగు ధృవ పత్రాలు :

నోటిఫికేషన్ లో ప్రస్తావించిన అన్ని ధృవ పత్రాలు అనగా విద్యార్హతలు , కులం, పుట్టిన తేదీ నివాసం మొదలగు పత్రములను స్వీయ ధ్రువీకరణ చేసి జత పరచవలెను.

🔥దరఖాస్తు అందచేయవలసిన చిరునామా:

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి, తలారసింగి, బాలసదనం ప్రక్కన, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా. Pin.No: 531024.

🔥 ఎంపిక విధానం:

షార్ట్ లిస్ట్ కాబడిన వారికి మౌఖిక ఇంటర్వ్యూ నిర్వహించి , ఎంపిక చేస్తారు.

🔥 జీతం:

సైకో సోషల్ కౌన్సిలర్ గా ఎంపిక అయిన వారికి 20,000/- రూపాయలు & మల్టీ పర్పస్ స్టాఫ్ / కుక్ గా ఎంపిక కాబడిన వారికి 13,000/- రూపాయలు & సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్ గా ఎంపిక్ కాబడిన వారికి 15,000/- రూపాయలు నెల జీతం లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు:

దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 02/04/2025

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది:15/04/2025.
👉  Click here to download notification & Application

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!