నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన SBI | SBI Youth For India Fellowship Program | SBI Internship Programme

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కొరకు అవకాశం ను కల్పిస్తుంది.

ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగ పరుచుకోండి. 

ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

ఈ ఇంటర్న్షిప్ ద్వారా భారతదేశం లోని ఔత్సాహిక యువతి యువకులకు ఉద్యోగ కల్పన కొరకు అవకాశం కల్పిస్తుంది.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • SBI ఫౌండేషన్ సంస్థ ఈ రిక్రూట్మెంట్ చేస్తుంది.

🔥 విద్యార్హత :

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి 01-10-2025 నాటికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ ఇంటర్న్షిప్ కి అర్హత కలదు.

🔥 వయస్సు :

  • 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల లోపు వయసు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • 05/08/1993 నుండి 06/10/2004 లోపు పుట్టిన వారు అర్హులు.

🔥 ఫెలోషిప్ కాలపరిమితి : 

  • 13 నెలల కాలపరిమితి కొరకు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ను నిర్వహిస్తారు.

🔥 స్టైఫండ్ :

  • ఫెలోషిప్ కార్యక్రమానికి ఎంపిక కాబడిన వారికి నెలకు పదహారు వేల రూపాయల స్టైఫండ్ లభిస్తుంది.
  • అదనపు అలవెన్సులు క్రింద ట్రావెలింగ్ కొరకు 2,000/- రూపాయలు & ప్రాజెక్ట్ సంబంధిత ఖర్చులకు 1,000/- రూపాయలు లభిస్తాయి.
  • ఇంటర్న్షిప్ పూర్తి అయిన తర్వాత రీ అడ్జస్ట్మెంట్ అలవెన్సు 90,000/- రూపాయలు లభిస్తాయి.
  • వసతి సదుపాయం, ఆరోగ్య బీమా , వ్యక్తిగత భీమా వంటి సదుపాయాలను కూడా కల్పిస్తారు.

🔥 దరఖాస్తు చేయు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ముందుగా ఆన్లైన్ విధానం లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అయ్యి, వ్యాస రూప ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, అవసరమగు ధృవపత్రాలు అప్లోడ్ చేయాలి.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను ఆన్లైన్ అసెస్మెంట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • 30/04/2025 లోగా ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.


  👉 Click here for Official website

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *