నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు | NMDC Recruitment 2025 | Latest Jobs Notifications 2025

భారత ప్రభుత్వ , స్టీల్ మంత్రిత్వ శాఖ పరిధిలో గల  నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైస్ అయిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC లిమిటెడ్) సంస్థ నుండి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

NMDC లిమిటెడ్ సంస్థ అర్హత కలిగిన మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి వివిధ విభాగాలలో అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతుంది..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

NMDC లిమిటెడ్ సంస్థ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేయు ఉద్యోగాలు :

అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 ఉద్యోగాల సంఖ్య:

మొత్తం 179 అప్రెంటిస్ లను భర్తీ చేస్తున్నారు.

ట్రేడ్ అప్రెంటిస్ :

COPA – 30

మెకానిక్ (డీజిల్) – 25

ఫిట్టర్ – 20

ఎలక్ట్రీషియన్ – 30

వెల్డర్ – 20

మెకానిక్ – 20

మెషనిస్ట్ – 05

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ :

మెకానికల్ ఇంజనీరింగ్ – 06

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 04

మైనింగ్ ఇంజనీరింగ్ – 04

సివిల్ ఇంజనీరింగ్ – 02

టెక్నీషియన్ అప్రెంటిస్ : 

మెకానికల్ ఇంజనీరింగ్ – 05

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 03

మైనింగ్ ఇంజనీరింగ్ – 01

MOM – 04

🔥 విద్యార్హతలు : 

ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.

టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.

పైన పేర్కొన్న విద్యార్హతలు ను 2021 లేదా అంతకంటే ముందే కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు కాదు.

 🔥 ఎంపిక విధానం:

నోటిఫికేషన్ లో ప్రస్తావించిన విధంగా పోస్టుల వారిగా 08/05/2025 నుండి 18/05/2025 వరకు నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాలను పొందవచ్చు.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉదయం 10:00 గంటలకు నిర్వహిస్తారు.

అభ్యర్థులు ఉదయం 9:00 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహణ స్థలం కు చేరి, రిజిస్టర్ అవ్వాలి.

🔥 ఇంటర్వ్యూ నిర్వహణ స్థలం:

Training institute, BIOM, Bacheli complex, DANTEWADA, CHHATTISGARH

🔥 ఇంటర్వ్యూ కొరకు అవసరమగు ధ్రువపత్రాలు:

ఫోటో తో కూడిన రెజ్యూమ్

డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్

ఆధార్ కార్డు

క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు

కాస్ట్ సర్టిఫికెట్ 

అన్ని ధ్రువపత్రాల ఒరిజినల్ మరియు జెరాక్స్ కాపీలను తీసుకొని వెళ్ళాలి.

ట్రేడ్ అప్రెంటిస్ అభ్యర్థులు www.apprenticeshipindia.org నందు , గ్రాడ్యుయేట్ మరియు టెక్నికల్ అప్రెంటిస్ అభ్యర్థులు https://nats.education.gov.in నందు ఇంటర్వ్యూ కి హాజరయ్యే కంటే ముందే రిజిస్టర్ అయి వుండాలి.

👉 Click here for notification 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!