AP లో మరో నోటిఫికేషన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లి ఏబిల్డ్ ట్రాన్స్ జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ సర్వీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు..
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటీ ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఏమిటి ? మరియు పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
ఈ పోస్టులకు అప్లై చెయాలి అనుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో OTPR రిజిస్ట్రేషన్ / లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేయాలి.
ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము .
APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-
APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/-
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టుల పేర్లు : వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లి ఏబిల్డ్ ట్రాన్స్ జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ సర్వీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్
మొత్తం పోస్టుల సంఖ్య : 02
విద్యార్హత : భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సోషల్ వర్క్ లేదా సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
జీతము : Rs.57,100/- నుండి 1,47,760/-
ఎంపిక విధానం : పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) మరియు కంప్యూటర్ ప్రోఫిసియన్సీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లై విధానం : APPSC అధికారిక వెబ్సైట్ లో
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 01-04-2024
అప్లికేషన్ చివరి తేదీ : 21-04-2024
పరీక్ష తేదీ : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.
హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.
వయస్సు : 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు (01-07-204 నాటికి)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు.
విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
ఫీజు : జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజు 250/- మరియు పరీక్ష ఫీజు 120/-
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250/- (వీరికి పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు)
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 450 మార్కులకు 2 పేపర్స్ తో పరీక్ష పెట్టి ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొదటి పేపర్లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు.
రెండవ పేపర్లో 150 ప్రశ్నలు 300 మార్కులకు ఇస్తారు.
ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంది.
ఈ పరీక్షలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించిన కటాఫ్ మార్కులు వచ్చిన వారికి కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్ణయించిన క్వాలిఫై మార్క్స్ వస్తే సరిపోతుంది.