AP Police Constable Mains Exam Date | Andhra Pradesh Police Constable Mains Exam Date | APSLPRB Mains Exam Date

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వచ్చిన మెయిన్స్ పరీక్ష తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఈరోజు అధికారికంగా ప్రకటించింది.

రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు గాను మెయిన్స్ పరీక్షను 01-06-2025 తేదీన నిర్వహించబోతున్నట్టు పత్రికా ప్రకటన విడుదల చేసింది.

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు :

  • ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 2022 సంవత్సరంలో నవంబర్ 28వ తేదీన 6,100 ఖాళీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది.
  • 23-01-2025 తేదిన 4,59,182 మంది అభ్యర్థులకు రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 997 పరీక్ష కేంద్రాల్లో ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించారు.
  • ఈ ప్రాథమిక రాత పరీక్షలో 95,208 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారు.
  • 30-12-2024 నుండి 01-02-2025 తేదిల మధ్య రాష్ట్రంలో 13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు నిర్వహించారు.
  • PMT మరియు PST పరీక్షల్లో 38,910 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు ఉత్తీర్ణత సాధించారు.
  • తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం 01-06-2025 తేదీన రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ , గుంటూరు, కర్నూలు , తిరుపతి ప్రాంతాల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నియామక మండలి ప్రకటించింది.

🏹 APSLPRB Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *