కేవలం 8వ తరగతి అర్హతతో హైకోర్టులో 171 మజ్దూర్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 17వ తేదీ నుండి మార్చి 18వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింద విధంగా ఉన్నాయి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఈ నోటిఫికేషన్ పాట్నాలో ఉన్న హైకోర్టు నుండి విడుదల కావడం జరిగింది.
🏹 తిరుపతి IIT లో ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- మజ్దూర్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 171 మజ్దూర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- 8వ తరగతి పాస్ అయితే చాలు. (12వ తరగతి కంటే ఉన్నత చదువులు చదివిన వారు ఈ పోస్టులకు అనర్హులు)
- సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
🔥 అనుభవం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- SC / ST / OH అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 350/-
- UR , BC, EBC , EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 700/- రూపాయలు.
🏹 ఇంటర్ పాస్ అయిన వారికి అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ విధానం :
- అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.
🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ :
- 11-02-2025 తేదీన పాట్నా హైకోర్టు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను 17-02-2025 తేది నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేది :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను 18-03-2025 తేదీలలోపు సబ్మిట్ చేయాలి.
🔥 జీతము వివరాలు :
- ఎంపికైన అభ్యర్థులకు 14,800/- నుండి 40,300/- వరకు పే స్కేల్ ప్రకారం జీతము ఇస్తారు.
🔥 కనీస వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 గరిష్ట వయసు :
- UR & EWS పురుష అభ్యర్థులకు గరిష్ట వయసు 37 సంవత్సరాల లోపు ఉండాలి.
- UR & EWS మహిళా అభ్యర్థులకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలలోపు ఉండాలి.
- BE మరియు EBC పురుష మరియు మహిళా అభ్యర్థులకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు లోపు ఉండాలి.
- SC మరియు ST పురుష మరియు మహిళా అభ్యర్థులకు గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి.
- OH అభ్యర్థులకు గరిష్ట వయస్సు 47 సంవత్సరాలు లోపు ఉండాలి.
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసుకున్న అర్హత ఉన్న అభ్యర్థులకు క్రింది విధంగా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష (OMR బేస్డ్ టెస్ట్)
- సైక్లింగ్ టెస్ట్
- స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ
🔥 క్వాలిఫై మార్కులు :
- రాత పరీక్షలో కనీసం 40% మార్కులు రావాలి.
- స్కిల్ టెస్ట్ లో కనీసం 40% మార్కులు రావాలి.
- ఇంటర్వ్యూలో కనీసం 30% మార్కులు రావాలి.
🏹 Note :
- ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Download Notification – Click here