సొంత ఊరిలో అంగన్వాడీ ఉద్యోగం చేసుకునే అవకాశం | AP Anganwadi Jobs Recruitment 2024 | Andhrapradesh Anganwadi Jobs Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

సొంత ఊరిలో ఉంటూ ఉద్యోగము చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త , అంగన్వాడి సహాయకురాలు , మినీ అంగన్వాడి కార్యకర్త అనే ఉద్యోగాలను పదో తరగతి అర్హత గల వారితో భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలకు స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు అర్హులు. కాబట్టి ఎంపికైన వారు తాము నివసిస్తున్న ప్రదేశంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. వివాహిత మహిళలకు ఇది చక్కని అవకాశం. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 84 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు అక్టోబర్ 1వ తేదీలోపు సంబంధిత సిడిపిఓ కార్యాలయాలలో అప్లై చేయాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, అనంతపురము జిల్లా 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 84

🔥 ఈ ఉద్యోగాలను ఉండవలసిన అర్హతలు : 

  • అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు , మినీ అంగన్వాడి కార్యకర్త ఉద్యోగాలకు 10th అర్హత ఉన్న వారు అర్హులు.

🔥 కనీస వయస్సు : కనీసం 21 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు (01-09-2024 నాటికి)

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాల (01-09-2024 నాటికి)

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన తేది : 24-09-2024

🔥 అప్లై ప్రారంభ తేదీ : 25-09-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 01-10-2024

గమనిక : ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతములలో 21 సంవత్సరాలు కలిగిన అభ్యర్థి లేకపోయినట్లయితే 18 సంవత్సరాలు నిండిన వారి అప్లికేషన్ కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

🔥 జీతం ఎంత ఉంటుంది : 

  • అంగన్వాడి కార్యకర్తకు – 11,500/-
  • మినీ అంగన్వాడి కార్యకర్త – 7,000/-
  • అంగన్వాడి సహాయకులకు – 7,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 10వ తరగతిలో వచ్చిన మార్కులు, ఇంటర్వూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

🔥 పరీక్ష విధానం : ఈ ఉద్యోగాల ఎంపికలో పరీక్ష లేదు , ఇంటర్వ్యు మాత్రమే నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.  

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు 

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి.

🔥 ఎలా అప్లై చెయాలి : అర్హత గల వారు తమ బయో డేటాతో పాటు అన్ని విద్యార్హతలు మరియు ఇతర సర్టిఫికెట్స్ Xerox Copies పైన Gazetted ఆఫీసర్ తో అటెస్టేషన్ చేయించి ICDS Project ఆఫీస్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

🔥 అప్లికేషన్ కు జతపరచల్సిన సర్టిఫికెట్స్ : 

  1. పుట్టిన తేది / వయస్సు ధృవీకరణ పత్రం
  2. కుల ధృవీకణ పత్రం
  3. విద్యార్హత ధ్రువీకరణ పత్రము – SSC మార్కుల లిస్ట్ , TC మరియు SSC కంటే చదివిన వారు దాన్ని మార్క్ లిస్ట్ మరియు TC జతపరచవలెను.
  4. నివాస స్థల ధ్రువీకరణ పత్రము
  5. వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
  6. వికలాంగులైనచొ పీహెచ్ సర్టిఫికెట్
  7. వితంతువు అయినచో పిల్లలు ఉన్నట్లయితే పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం
  8. ఆధార్ కార్డు
  9. రేషన్ కార్డు

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *