ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 245 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ | AP Highcourt 245 Vacancies Notification 2025 Details in Telugu | AP Court Jobs Recruitment 2025

AP Highcourt upcoming Notifications Vacancies 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదలైన విషయం మీ అందరికీ తెలిసిందే. పది రకాల నోటిఫికేషన్లు ద్వారా 1620 ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో జూన్ రెండవ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు..

జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన హైకోర్టు, హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ విభాగాల్లో 245 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది.

హైకోర్టులో భర్తీ చేయబోయే ఉద్యోగాలు ఇవే :

రిజిస్ట్రార్ జ్యుడీషియల్-2, రిజిస్ట్రార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడిటర్, జాయింట్ రిజిస్టర్, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్టార్, సెక్షన్ ఆఫీసర్, కోర్టు ఆఫీసర్, స్క్రూట్ని ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, UD స్టెనో, అసిస్టెంట్స్, ఎగ్జామినర్, టైపిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కాపీయర్ మిషిన్ ఆపరేటర్, సీనియర్ సిస్టం ఆఫీసర్, సిస్టమ్ ఆఫీసర్, సిస్టం అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సభార్డినేట్, ప్రాజెక్ట్ లీడర్ లేదా ప్రాజెక్ట్ హెడ్, మాడ్యూ లీడర్/ యూజర్ ఇంటర్ఫేస్/ వెబ్ డిజైనర్స్ అనే ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.

హైకోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ?

AP హైకోర్టు ఉద్యోగాలకు జూన్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

🏹 AP హైకోర్టు అర్హతలు ఏమిటి ?

ఏపీ హైకోర్టు నుండి విడుదల కాబోయే ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మరియు ఇతర విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేయవచ్చు..

🏹 Download Vacancies Pdf – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *