గ్రామీణ విద్యుత్ సంస్థల్లో ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం | PGCIL Field Supervisor Jobs Recruitment 2025 | Latest jobs in Telugu

భారత ప్రభుత్వ, మినిస్ట్రీ ఆఫ్ పవర్ పరిధిలో గల మహారత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) సంస్థ నుండి కాంట్రాక్టు ప్రాధిపతికన ఫీల్డ్ సూపర్వైజర్ ( సేఫ్టీ) పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం , విద్యార్హతలు, వయస్సు వంటి  పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది 

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • మొత్తం  28 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • ఫీల్డ్ సూపర్వైజర్ (సేఫ్టీ)  ఉద్యోగాల భర్తీ  కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 విద్యార్హత :

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ  నుండి ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ (పవర్) / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ / పవర్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్ ) / సివిల్ / మెకానికల్ / ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ / విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
  • వర్క్ సైట్లలో సేఫ్టీ ఇంప్లిమెంటేషన్ ఒక సంవత్సరం అనుభవం కలిగి వుండాలి.

 🔥 గరిష్ఠ వయస్సు :

  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 29 సంవత్సరాలలోపు వుండాలి.
  • వయస్సు నిర్ధారణ కొరకు 25/03/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
  • ఓబీసీ వారికి 3 సంవత్సరాలు , ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు , PWbD వారికి 10 సంవత్సరాలు వయోపరిమితి కలదు.

🔥 దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

  • ఎస్సీ , ఎస్టీ , PwBD, ex – సర్వీస్ మాన్ వారికి ఎటువంటి ఫీజు లేదు.
  • మిగతా అభ్యర్థులు 300/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

🔥 జీతం :

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 23,000/- బేసిక్ పే తో పాటు HRA & DA మొదలగు అలౌవన్స్ లు లభిస్తాయి. 

 🔥 ఎంపిక విధానం :

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వారి  అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 05/03/2025 (సాయంత్రం 05:00 గంటల నుండి)
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 25/03/2025
  • అర్హత నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది : 25/03/2025

👉  Click here for notification 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!