ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (APMSRB) నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా ఉండే నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం మరియు టెలిమానస్ సెల్స్ నందు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
APMSRB భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, కౌన్సిలర్, టెక్నికల్ కోఆర్డినేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
APMSRB భర్తీ చేస్తున్న మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 76 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది.
APMSRB భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండాల్సిన వయస్సు :
ఈ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు కూడా ఉంటుంది. PWD అభ్యర్థులకు పది సంవత్సరాలు వరకు సడలింపు ఉంటుంది.
✅ ఏపీలో హోంగార్డు ఉద్యోగాలు ముఖ్యమైన అప్డేట్ విడుదల – Click here
APMSRB భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు :
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు క్రింద తెలిపిన విధంగా పోస్టుల వారీగా విద్యార్హతలు ఉండాలి.

APMSRB ఉద్యోగాలకు అప్లికేషన్ తేదీలు :
ఈ ఉద్యోగాలకు 07-06-2025 తేది నుండి 18-06-2025 తేది వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
APMSRB భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపిక విధానం :
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేస్తున్న ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రూరల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Note :
- ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేయండి.
- క్రింది మీకోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇవ్వబడినవి.
✅ Download Notification – Click here