రాష్ట్రంలో పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం మరికొద్ది రోజులలో అమలు కానుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయ్యింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియచేయడం జరిగింది.
అలానే రైతులు EKYC కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ అన్ని అంశాల పై సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
రైతులు అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది.
🔥 జూన్ 20న అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగం అయిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజులలో అమలు చేయనుంది.
- గతంలో ప్రకటించిన విధంగా పీఎం కిసాన్ పథకం అమలు చేసే రోజున అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ నెల 20 వ తేదీన నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం లభిస్తుంది. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తేదీన ఈ పథకం అమలు చేసే అవకాశం కనిపిస్తుంది.
🔥అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ద్వారా 20 వేల లబ్ది :
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా 20,000 రూపాయల లబ్ది కలుగుతుంది.
- ఈ 20 వ తేదీన కేంద్ర ప్రభుత్వం లబ్ది దారుల ఖాతాలలో 2,000 రూపాయలు జమ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం అదే రోజు 5,000 రూపాయల జమ చేయనుంది. మొత్తం 7,000 రూపాయలు లబ్ధి దారుల ఖాతాలో పడనున్నాయి.
- అయితే అర్హత జాబితాలలో ఈ రెండు పథకాలలో కనిపిస్తుంది.
- అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రం లో 45.71 లక్షల రైతులను అర్హులుగా గుర్తించారు.
- రెండవ విడతలో అక్టోబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు & కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు జమ చేస్తాయి.
- మూడవ విడతలో భాగంగా వచ్చే సంవత్సరం జనవరి నెలలో 4 వేల రూపాయలు & కేంద్ర ప్రభుత్వం 2 వేలు జమ చేస్తాయి.
🔥కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం వర్తింపు :
- కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే.
- ఇందుకు భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కౌలు రైతు గుర్తింపు కార్డులు ( Crop cultivator Rights card ) ను మంజూరు చేయాలని ప్రక్రియ ప్రారంభించింది.
- కౌలు రైతులకు పంట కాలం మొదలు అయ్యాక ,వారిని గుర్తించి , కౌలు రైతుల జాబితా రూపొందించి , ఆ జాబితా కు అనుగుణంగా వీరికి కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తారు.
- కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే అందించనుంది.
- వీరితో పాటుగా అటవి భూముల పట్టాలు పొందిన రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు.
🔥 రైతులకు అన్నదాత సుఖీభవ పథకం పొందేందుకు EKYC :
- రాష్ట్రంలో కమతాల వారిగా లెక్కించినప్పుడు మొత్తం 93 లక్షల మంది రైతులు ఉన్నట్లు తెలుస్తుంది.
- అయితే ఇందులో ఆదాయ పన్ను చెల్లించే వారు , ప్రజా ప్రతినిధులు , వ్యవసాయ భూమి ను వ్యవసాయేతర భూమిగా ఉపయోగిస్తున్న వారు ఉన్నారు.
- రైతు సేవా కేంద్రాలలో గల సిబ్బంది మొత్తం 79 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా రిజిస్టర్ అయ్యారు.
- అయితే రాష్ట్ర ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా ఆధారంగా , సిక్స్ స్టెప్ వాలిడేషన్ ప్రక్రియ ద్వారా అర్హులను గుర్తించగా మొత్తం 45.71 లక్షల మంది అర్హులుగా గుర్తించబడ్డారు.
- రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు గాను ముందుగా రైతుల వద్ద EKYC ప్రక్రియ పూర్తి చేయనుంది.
- ఆ తర్వాత రైతుల ఆధార్ కి లింక్ కాబడిన బ్యాంకు అకౌంట్ మరియు NPCI పూర్తి కాబడిన అకౌంట్ కు డబ్బులు జమ చేయనుంది.
✅ రాష్ట్రంలో మరో కొత్త పథకం – ఆదరణ 3.0 పథకం వివరాలు – Click here
🏹 అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకోండి ఇలా :

- పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతులు తమ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయా లేదా అనేది ముందుగానే తెలుసుకోవచ్చు.
- దీని కోసం ముందుగా క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి రైతు తన యొక్క ఆధార్ నంబర్ మరియు అక్కడ ఉన్న CAPTCHA ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు.
✅ Anndhata Sukhibava Scheme Status – Click here
