AP Contract Outsourcing latest Jobs Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీ లోపు అప్లై చేయాలి. మొత్తం 56 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి విడుదలైంది..
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫైనాన్స్ కం లాజిస్టిక్ కన్సల్టెంట్, ఫిజియోథెరపిస్ట్, ఆడియో మెట్రీషియన్, సానిటరీ అటెండెంట్, సపోర్టింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ మరియు లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు..
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 56 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు మరియు జీతము వివరాలు :
పోస్టులను అనుసరించి క్రింది విధంగా విద్యార్హతలు మరియు జీతం వివరాలు ఉంటాయి..
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 09-10-2025
అప్లికేషన్ చివరి తేదీ : 22-10-2025
ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 07-11-2025
గ్రీవెన్స్ పెట్టుటకు మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 15-11-2025
అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 20-11-2025
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ , చిత్తూరు అనే పేరు మీద 500 రూపాయలు డిడి తీసి అప్లికేషన్ కు జతపరచాలి.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
ఈ పోస్టులకు అర్హత ఉండేవారు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కార్యాలయం, చిత్తూరు నందు అప్లికేషన్ అందజేయాలి.
ఎంపిక విధానం వివరాలు :
ఉద్యోగాలు ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
గమనిక :
ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్లో పూర్వపు జిల్లాలు ప్రకారం చిత్తూరు జిల్లాకు చెందిన స్థానిక అభ్యర్థులు అర్హులు.
✅ Download Notification – Click here
✅ Official Website – Click here