ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఆయుష్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 107 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి . నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి విడుదలైంది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు :
తాజాగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్, సైకియాట్రిస్ట్, ఆయుష్ డాక్టర్ (ఆయుర్వేద), ఆయుష్ డాక్టర్ (హోమియో), ఆయుష్ డాక్టర్ (యునాని) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు..
భర్తీ చేస్తున్న మొత్తం పోస్టులు సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 107 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అప్లికేషన్ విధానము :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి.
అప్లికేషన్ తేదీలు :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు APMSRB వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నవంబర్ 1వ తేదీ నుండి నవంబర్ 15వ తేదీ లోపు అప్లై చేయాలి.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 1000/- రూపాయలు..
,SC, ST, BC, EWS, Differently abled and Ex-Servicemen అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 750/-
✅ Download Notification – Click here
