ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం… ఈ ఏప్రిల్ లోనే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ నుండి 15వ తేదీ మధ్య ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు జవాబు పత్రాలు మూల్యాంకనం చురుగ్గా నిర్వహిస్తోంది. మూల్యాంకనం ముగిసిన తర్వాత సాధ్యమైనంత తొందరగా ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తుంది.
ఇప్పటికే మొదలైన జవాబు పత్రాలు మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 6వ తేది నాటికి ముగుస్తుంది. విద్యార్థులకు వచ్చిన మార్కులు వివరాలను కంప్యూటరీకరణ చేసేందుకు ఒక వారం రోజులు పడుతుంది. ఆ తర్వాత పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారు. ఈ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా విడుదల చేసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలను ఈసారి విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల హాల్ టికెట్స్ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే.
విద్యార్థులు 9552300009 అనే what’s App నంబర్ ద్వారా మరియు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకొనే అవకాశం ఉంటుంది. ఫలితాలను విద్యార్థులు PDF రూపంలో డౌన్లోడ్ చేసుకునే రూపంలో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ PDF లు షార్ట్ మెమోలుగా ఉపయోగపడతాయి.
🏹 Intermediate Board Official Website – Click here