యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క స్వయం ప్రతిపత్తి ఇంటర్ యూనివర్సిటీ కేంద్రమైన ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ సెంటర్ నుండి క్లర్క్ కం టైపిస్ట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ల్యాబ్ అటెండెంట్ – కంప్యూటర్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే భారతీయ పౌరులు అందరూ ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జనవరి 25వ తేదీ నుండి ఫిబ్రవరి 23వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి..
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- గాంధీ నగర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ సెంటర్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- క్లర్క్ కం టైపిస్ట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ల్యాబ్ అటెండెంట్ – కంప్యూటర్) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 02 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టులవారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- క్లర్క్ కం టైపిస్ట్ – 01
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ల్యాబ్ అటెండెంట్ – కంప్యూటర్) – 01
🔥 విద్యార్హతలు :
- ఈ రెండు రకాల ఉద్యోగాలకు క్రింది విధంగా విద్యార్హతలు ఉండాలి.
క్లర్క్ కం టైపిస్ట్ :
- క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగానికి 12th లేదా తత్సమానమైన విద్యార్హత ఉండాలి.
- ఇంగ్లీషులో అయితే నిమిషానికి 35 పదాలు, హిందీలో అయితే నిమిషానికి 30 పదాలు వేగంతో టైపింగ్ చేయడం వచ్చి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ల్యాబ్ అటెండెంట్ – కంప్యూటర్) :
- పదో తరగతి విద్యార్హతతో పాటు కనీసం ఆరు నెలల కంప్యూటర్ లేదా ఐటిఐ సర్టిఫికెట్ కోర్సు ITI లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి పొంది ఉండాలి.
🏹 పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు – Click here
🔥 జీతము వివరాలు :
- పోస్టుల వారీగా జీతం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగానికి 19,900/- నుండి 63,200/- వరకు పేస్కేల్ ఉంటుంది.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ల్యాబ్ అటెండెంట్ – కంప్యూటర్) ఉద్యోగానికి 18,000/- నుండి 56,900/- వరకు పే స్కేల్ ఉంటుంది.
🔥 గరిష్ట వయస్సు :
- క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ల్యాబ్ అటెండెంట్ – కంప్యూటర్) ఉద్యోగానికి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు తరలింపు వర్తిస్తుంది.
- ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది
- విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- SC, ST, PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 500/-
- మిగతా కేటగిరి అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 1000/-
🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానము :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ముందుగా ఆన్లైన్ విధానంలో అప్లై చేసి , అప్లికేషన్ హార్డ్ కాపీను అవసరమైన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో జతపరిచి పోస్ట్ ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
- Recruitment Cell, Information and Library Network Centre, Opp. NIFT, INFOCITY, Gandhinagar, Gujarat- 382007
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు 25-01-2025 తేదీ నుండి ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేది :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేది 23-02-2025
🏹 Download Notification – Click here