తెలంగాణాలో 1629 రేషన్ డీలర్ల పోస్టులకు నోటిఫికేషన్ | Telangana Ration Dealers Recruitment 2024 | Latest jobs in Telangana

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.. తెలంగాణలో ఖాళీగా ఉన్న 1629 రేషన్ డీలర్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సచివాలయంలో పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ మరియు ఇతర అధికారులు కూడా హాజరయ్యారు. 

ఈ సమావేశంలో రేషన్ దుకాణాలకు సన్న బియ్యం పంపిణీ, రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ, గోధుమలు పంపిణీ , 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, వంటి వాటిపై మంత్రులు సమీక్షించారు.

🔥 రేషన్ డీలర్ల భర్తీ : తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారు జరిపిన సమావేశంలో ఖాళీగా ఉన్న 1629 రేషన్ డీలర్ల భర్తీపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఖాళీలు భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రిగారు ఆదేశాలు జారీ చేశారు. 

🔥 అర్హతలు : ప్రభుత్వ నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఈ ఖాళీలు భర్తీకి ఆయా జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఖాళీలను 10వ తరగతి అర్హతతో భర్తీ చేస్తారు. 

🔥 పోస్టింగ్ : ఖాళీలు ఉన్న గ్రామంలో నివసిస్తున్న పదో తరగతి అర్హత కలిగిన వారితో ఈ పోస్టులను భర్తీ చేసి వారికి అక్కడే పోస్టింగ్ కూడా ఇస్తారు. 

🔥 వయస్సు : ప్రభుత్వ నిబంధనలో ప్రకారం ఈ పోస్టులకు 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులవుతారు. 

🔥 ఎంపిక విధానం : రేషన్ డీలర్లుగా పనిచేయడానికి ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసే అవకాశం ఉంది.

Note : ఈ రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మన వెబ్సైట్ ద్వారా మీకు సమాచారం తెలియజేస్తాము. కాబట్టి ప్రతి రోజు www.inbjobs.com అని వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఈ సమాచారాన్ని మన టెలిగ్రామ్ వాట్సాప్ చానల్స్ లో కూడా మీకు షేర్ చేసి తెలియజేస్తాము. కాబట్టి మా సోషల్ మీడియా ఛానల్స్ లో క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. ఇలాంటి చాలా రకాల ఉద్యోగాలు సమాచారం మేం ప్రతిరోజు నిరుద్యోగుల కోసం అందులో షేర్ చేస్తూ ఉన్నాము.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *