Appointment of night watchmen in 5388 high schools in andhrapradesh

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు – నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గల స్కూల్స్ అన్నిటినీ దశల వారీగా నవినీకరిస్తుంది.ఇందులో భాగంగా స్కూల్స్ అన్నింటిలో 11 రకాల పనులను జరిపి సదుపాయాలను కల్పించింది.రన్నింగ్‌ వాటర్‌తో కూడిన టాయి­లెట్లు, తాగునీటి సరఫరా, పెద్ద-చిన్న మరమ్మతు­లు, , ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లతో విద్యుదీకరణ, విద్యా­ర్థులు&ఉపాధ్యాయులు కి ఫర్నీచర్, గ్రీన్‌ చాక్‌బోర్డులు, పాఠశాల మొత్తం పెయింటింగ్, ఇంగ్లిష్‌ ల్యాబ్, ప్రహరీ, కిచెన్‌ అలానే స్కూల్స్ లో పరిశుభ్రత నిర్వహణ కొరకు ఆయాలు( శానిటరీ వర్కర్లు)ను నియమించింది.మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు రసాయనాలు, సాధనాలను కూడా ప్రభుత్వం అందించింది.

ఇప్పుడు అన్ని నాడు నేడు హై స్కూల్స్( ఫేజ్ -1& ఫేజ్ -2) యొక్క సౌకర్యాలును, పరికరాలను రక్షణ కల్పించడానికి ,భద్రంగా వుంచడానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ అలానే స్కూల్స్ పరిసరాల్లో జరిగే అసాంఘీక కార్యక్రమాలు ను నిరోధించడానికి, ప్రభుత్వం ఒక హైస్కూల్ కి ఒకరు చొప్పున మొత్తం 5388 మంది నైట్ వాచ్మెన్ నియమించడానికి ఆదేశాలు జారీ చేసింది. DEO ల ఆద్వర్యం లో ఈ నియామకాలు జరుగుతాయి. నైట్ వాచ్ మెన్ గా పనిచేసేవారు రూ 6000/- గౌరవ వేతనం పొందుతారు.

అర్హత:

1. నైట్ వాచ్ మెన్ లను పేరెంట్స్ కమిటీ ద్వారా నియమిస్తారు.

2.ఇప్పటికే నియమించబడ్డ ఆయా భర్తకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

3. అదే గ్రామంలో లేదా వార్డ్ లో నివసిస్తున్న ఎక్స్ – సర్వీస్ మెన్ కి రెండవ ప్రాధాన్యత లభిస్తుంది.

4.పై ఇద్దరూ లేనట్లు అయితే పేరెంట్ కమిటీ మిగతా ఎవరినైనా నియమించవచ్చు.

5.స్థానిక గ్రామ నివాసి అయి వుండాలి.

వయస్సు:60 సంవత్సరాల లోపు వయస్సు కలవారై వుండాలి.

గౌరవ వేతనం: టాయిలెట్ మైంటైనేన్స్ ఫండ్ ద్వారా నెలకి రూ.6000/- గౌరవ వేతనం లభిస్తుంది.

నైట్ వాచ్ మెన్ నిర్వహించాల్సిన విధులు:

1.పాఠశాల మూసివేయడానికి ముందు సాయంత్రం పాఠశాలకు హాజరు కావాలి.

2.పని దినాల్లో మరుసటిరోజు పాఠశాల తెరిచే వరకూ విధుల్లో వుండాలి.ఇతర రోజుల్లో పూర్తిస్థాయిలో విధుల్లో వుండాలి.సంబంధిత ప్రధానోపాధ్యాయులు యొక్క పర్యవేక్షణ లో పనిచేయాలి.

3.కాపలాదారు విధుల్లో ప్రధానంగా పాఠశాల యొక్క ఆస్తులు,పాఠశాల భవనాలు& ప్రాంగణానికి,ఇతర వస్తువులు, పరికరాలకు రక్షకుడిగా పనిచేయాలి.

4.పాఠశాల ప్రాంగణంలోకి అనధికార వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా ,అసాధారణ కార్యకలాపాలు జరిగినప్పుడు, అగ్నిప్రమాదం వంటివి ఏర్పడినప్పు­­డు, ఏదైనా అనుమానం వచ్చినప్పుడు సంబంధిత హెడ్‌ మాస్టర్‌కు, సమీప పోలీస్‌ స్టేషన్‌కు, అగ్నిమాపక విభాగానికి నివేదించాలి.

5.సాయంత్రం వేళలలో పాఠశాల యొక్క తోట(గార్డెన్)కు నీరు పోయాలి.

6.ఎప్పటికప్పుడు ఆర్వో ప్లాంట్‌ను శుభ్రం చేయాలి.

7.పాఠశాల పని వేళలు కానీ సమయంలో పాఠశాల కి సంబంధించిన మెటీరియల్‌ను వస్తె వాటిని రిసీవ్ చేసుకొని ప్రధానఉపాద్యాయులుకు అందించాలి.

8.స్కూలుకు సంబంధించి ప్రధానఉపాద్యాయులు చెప్పే ఇతర పనులను చేయాలి.

9. నైట్‌ వాచ్‌మన్‌ పనిని హెడ్‌మాస్టర్, పేరెంట్స్‌ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.

10.01 మే 2023 వ తేదీనుంచి పాఠశాలల్లో వాచ్‌­మన్లను నియమించేలా చర్యలు తీసుకోవాలి.

11. నైట్‌ వాచ్‌మన్‌ రిజిస్ట్రేషన్‌ సంబంధిత హెడ్‌మాస్టర్‌ ఐఎంఎంఎస్‌ యాప్‌ ద్వారా చేపట్టాలి. 12. వాచ్‌మన్లను నియమించిన అనంతరం ఆ వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

ఐఎంఎంఎస్‌ యాప్ లో హాజరు నమోదు చేయాలి.మండల విద్యాధికారి వారు ఈ నియామకాలను మానిటర్ చేస్తారు.

ప్రతీ నెలా చివర హాజరు ఆధారంగా వీరికి జీతం అందిస్తారు.

👉 Official G.OClick here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

One thought on “Appointment of night watchmen in 5388 high schools in andhrapradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!