| AP Contract Basis Jobs Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ (మేనేజర్) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానములో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో నవంబర్ 17వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ లోపు అప్లై చేయాలి .
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి.
✅ AP Outsourcing Jobs – Click here
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి విడుదల చేయడం జరిగింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
తాజాగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ (మేనేజర్స్) అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

భర్తీ చేస్తున్న మొత్తం ఉద్యోగాలు :
నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎనిమిది పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు :

జీతము వివరాలు :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 61,960/- జీతము ఇస్తారు.
వయస్సు వివరాలు :
గ వయసు 42 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
వయసులో సడలింపు వివరాలు :
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ఓసి అభ్యర్థులు వెయ్యి రూపాయలు, మిగతా అభ్యర్థులు 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం వివరాలు :
ఈ ఉద్యోగాల ఎంపికలో మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
✅ Download Notification – Click here
