BISAG-N Young Professionals Notification 2025 : భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ నుండి యంగ్ ప్రొఫెషనల్-1 , యంగ్ ప్రొఫెషనల్-2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో ఎలాంటి ఫీజు లేకుండా అప్లై చేయవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..
✅ పదో తరగతి అర్హతతో 1027 ఉద్యోగాలు – click here
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ అనే సంస్థ నుండి విడుదల చేయడం జరిగింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్-1 , యంగ్ ప్రొఫెషనల్-2 అనే ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు..
మొత్తం ఖాళీల సంఖ్య :
భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో యంగ్ ప్రొఫెషనల్-1 ఉద్యోగాలు 90 ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్-2 ఉద్యోగాలు 10 ఉన్నాయి..
అప్లై చేయు విధానము :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
విద్యార్హతలు :
యంగ్ ప్రొఫెషనల్-1 ఉద్యోగాలకు కంప్యూటర్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లేదా డేటా సైన్స్ లో కనీసం 60 శాతం మార్కులతో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు.
యంగ్ ప్రొఫెషనల్ -2 ఉద్యోగాలకు కంప్యూటర్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లేదా డేటా సైన్స్ లో కనీసం 60 శాతం మార్కులతో ఎం ఇ లేదా ఎంటెక్ పూర్తి చేసిన వారు అర్హులు.
వ వయస్సు వివరాలు :
అక్టోబర్ 17వ తేదీ నాటికి 22 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు..
జీతము వివరాలు :
- యంగ్ ప్రొఫెషనల్ -1 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 30,000/- రూపాయలు జీతం ఇస్తారు.
- యంగ్ ప్రొఫెషనల్ -2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 42,000/- జీతం ఇస్తారు.
- ఎంపికైన వారికి పనితీరు ఆధారంగా ప్రతి సంవత్సరం 10 శాతం వరకు ఇంక్రిమెంట్ ఇస్తారు.
✅ Download Notification – Click here
