APPSC గ్రూప్ 2 మరియు అనలిస్ట్ గ్రేడ్ – 2 ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPT పరీక్ష తేదీ ప్రకటన | APPSC Group 2 CPT Dates

APPSC గ్రూప్ 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 (APPSC గ్రూప్ 2) మరియు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పరీక్ష నిర్వహణ తేదీని ప్రకటించింది.

ఏపీపీఎస్సీ ఈ ఉద్యోగాల భర్తీ నిమిత్తం గతంలో నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీపీఎస్సీ వారు విడుదల చేసిన అధికారిక వెబ్ నోట్ సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ నుంచి చివరి వరకు చదవగలరు.

🔥 జూలై 05 న APPSC గ్రూప్ 2 & అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు CPT పరీక్ష నిర్వహణ :

  • ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మరియు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీ నిమిత్తం నిర్వహించవలసిన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ను జూలై 5వ తేదీన నిర్వహిస్తామని అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియజేశారు.
  • రిక్రూట్మెంట్ లో భాగంగా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి కావడం అభ్యర్థులకు ఈ సీపీటీ పరీక్షను నిర్వహిస్తారు.

🔥APPSC గ్రూప్ 2 & అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు 6 ప్రధాన కేంద్రాలలో CPT పరీక్ష నిర్వహణ:

  • ఈ CPT పరీక్షను రాష్ట్రంలో గల ఆరు జిల్లా ప్రధాన కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అవి: 1
  • 1. విశాఖపట్నం
  • 2. కాకినాడ
  • 3. ఎన్టీఆర్ (విజయవాడ)
  • 4. గుంటూరు
  • 5. తిరుపతి
  • 6. అనంతపురం

ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను జూలై 01 ( 01.07.2025) నుండి అందుబాటులో ఉంచనున్నట్లు వెబ్ నోట్ లో తెలియచేసారు.

CPT పరీక్ష కు షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులు ఈ కొద్ది రోజుల సమయాన్ని సిలబస్ ఆధారంగా CPT పరీక్షకు ప్రిపేర్ అయి , పరీక్షలో విజయం సాధిస్తారు అని ఆశిస్తున్నాం.

👉 Click here to Download webnote

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!