Download AP DSC Hall Tickets 2025 | How to AP DSC Hall Tickets @https://apdsc.apcfss.in/

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 పోస్టులు భర్తీ ప్రక్రియలో భాగంగా మెగా డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షలను జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. కొన్ని రకాల కేంద్ర ప్రభుత్వ పరీక్షలు కూడా ఉండడంతో మధ్యలో ఐదారు రోజులు అంతరాయం కూడా ఉండవచ్చు. అభ్యర్థుల కోరిక మేరకు జిల్లాకు ఒక ప్రశ్నాపత్రం, 90 రోజుల సమయం ఇవ్వలేమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది దీనికి గల కారణాలు కూడా వివరించింది.

AP Mega DSC Exams :

  • మెగా డీఎస్సీ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలు పూర్తయ్యాక స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. చివరిగా ఎస్జిటి పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తారు.
  • డీఎస్సీ పరీక్షలు రెండు సెషన్స్ లో నిర్వహిస్తారు. మొదటి సెషన్ లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండవ సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది.
  • ప్రిన్సిపల్ , పిజిటి, PD ఉద్యోగాలకు మాత్రం మూడు గంటలు పరీక్షలు ఉంటాయి. అనగా 9:00 నుండి 12:00 వరకు ఉంటాయి.
  • పిజిటి, టిజిటి, ప్రిన్సిపల్ ఉద్యోగాలకు గంటన్నర పాటు ఇంగ్లీష్ పరీక్ష కూడా ఉంటుంది.

Download AP DSC Hall Tickets (వెబ్సైట్ లో డీఎస్సీ హాల్ టికెట్స్)

  • వెబ్సైట్లో శుక్రవారం రాత్రి నుండి నుండి డీఎస్సీ పరీక్ష హాల్ టికెట్స్ పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది.
  • అభ్యర్థులు తమ వివరాలు ఇచ్చి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ నుండి తమ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయవచ్చు.

Download AP Mega DSC Hall Tickets – Click here

🏹 ఏపీ హైకోర్టులో 245 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here

AP DSC Total Applications :

  • డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్న 16,347 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారు.
  • ఇతర రాష్ట్ర అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడంతో అభ్యర్థుల సౌకర్యార్థం తెలంగాణ, కర్ణాటక, ఒడిషా మరియు తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.

How to Download AP DSC Hall Tickets :

  • అభ్యర్థులు ఏపీ డీఎస్సీ హాల్ టికెట్స్ ను https://apdsc.apcfss.in/ అనే వెబ్సైట్లోకి వెళ్లి క్యాండిడేట్ లాగిన్ పై క్లిక్ చేసి అక్కడ మీ రిజిస్టర్డ్ ఐడి మరియు పాస్వర్డ్ వివరాలు ఇచ్చి లాగిన్ అయ్యాక హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసి పరీక్షకు హాజరు కావచ్చు.
  • అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ సర్వీస్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం వాట్సాప్ ఓపెన్ చేసి 9552300009 అనే నెంబర్ కు ” Hi ” అని మెసేజ్ పంపించడం ద్వారా కూడా డీఎస్సీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *