1,00000/- జీతంతో ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలు భర్తీ | AAI Junior Executive Jobs Notification 2025 | Latest Government Jobs Recruitment 2025

ఎయిర్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుండి వివిధ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 17వ తేదీ నుండి మార్చి 18వ తేదీలోపు సబ్మిట్ చేయాలి. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🏹 తిరుపతి IIT లో ఉద్యోగాలు భర్తీ – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు..

🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 83 పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు విభాగాలు వారీగా క్రింది విధంగా ఉన్నాయి. 
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్) – 13
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రిసోర్సెస్) – 66
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్) – 04

🏹 కోర్టులో మజ్దూర్ ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 విద్యార్హతలు : 

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్) ఉద్యోగాలకు ఫైర్ లేదా మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో BE / B.Tech పూర్తి చేసిన వారు అర్హులు. 
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రిసోర్సెస్) ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ తోపాటు HRM / HRD / PM&IR / లేబర్ వెల్ఫేర్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు.
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్) ఉద్యోగాలకు హిందీ లేదా ఇంగ్లీషులో పోస్ట్ గ్రాడ్యుకేషన్ తో పాటు డిగ్రీ లెవెల్ లో సంబంధిత సబ్జెక్ట్ చదివి ఉండాలి.

🔥 అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • GEN / OBC / EWS అభ్యర్థులు 1000/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC / ST / PwBD / మహిళ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

🏹 ఇంటర్ పాస్ అయిన వారికి అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here 

🔥 అప్లికేషన్ విధానం : 

  • అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 17వ తేది నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేది : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను మార్చి 18వ తేదీలలోపు సబ్మిట్ చేయాలి.

🔥 జీతము వివరాలు : 

  • ఎంపికైన అభ్యర్థులకు 40,000/- నుండి 1,40,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.

🔥 వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు లోపు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • SC , ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 

🔥 ఎంపిక విధానం : 

  • ఎంపిక విధానంలో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అప్లికేషన్ వెరిఫికేషన్, ఫిజికల్ టెస్ట్స్, ఫైనల్ మెరిట్ లిస్టులు విడుదల చేసి ఎంపిక చేస్తారు.

🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Notification – Click here 

🏹 Apply Online – Click here 


🏹 Download Syllabus Pdf – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!