మీ రేషన్ కార్డులో తప్పులు ఉన్నాయా ? వాటిని సరిదిద్దాలని చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారా ? అయితే మీలాంటి వారికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. రేషన్ కార్డులో Age, Gender, Relationship, address వంటి వివరాలు మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ ను మీరు చివరి వరకు చదవండి. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకోండి..
🏹 Join Our Telegram Group – Click here
రేషన్ కార్డులో మార్పు చేయాలి అంటే ఎక్కడ సంప్రదించాలి :
మీ రేషన్ కార్డు ఏ గ్రామ లేదా వార్డు సచివాలయం పరిధిలోకి వస్తుందో అక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
రేషన్ కార్డులో మార్పులు కోసం ఎవరిని సంప్రదించాలి ?
- గ్రామ సచివాలయంలో అయితే డిజిటల్ అసిస్టెంట్ ను సంప్రదించాలి. వార్డు సచివాలయంలో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రొసీసింగ్ సెక్రటరీను సంప్రదించాలి..
✅ మీ మొబైల్ లో అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చూడండి – Click here
రేషన్ కార్డులో మార్పులకు అవసరమయ్యే సర్టిఫికెట్స్ :
- Age / DOB మార్పు చేయడానికి డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదా ఆధార్ కార్డు లేదా పదో తరగతి సర్టిఫికెట్ ఉండాలి.
- Gender మార్చడానికి ఆధార్ లేదా మెడికల్ / లీగల్ డాక్యుమెంట్ ఉండాలి.
- Relationship మార్చడానికి పాస్ బుక్ లేదా ఫ్యామిలీ డిక్లరేషన్ లెటర్ ఉండాలి.
- అడ్రస్ మార్చడానికి ఎలక్ట్రిసిటీ బిల్ లేదా ఆధార్ లేదా రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి.
రేషన్ కార్డులో తప్పులు సరిదిద్దడం వలన జరిగే ప్రయోజనాలు ఇవే :
- రేషన్ కార్డులో ఉన్న తప్పులు కారణంగా మీరు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ఉన్నట్లయితే, తప్పులు సరిదిద్దడం వలన మీకు ప్రభుత్వ పథకాలకు అర్హత ఉంటుంది.
- అర్హత ఉన్న వారందరికీ రేషన్ వస్తుంది.
- EKYC తో ప్రభుత్వం వద్ద ఉన్న డేటాతో అనుసంధానం అవుతుంది.
గమనిక :
- మీరు రేషన్ కార్డులో మార్పులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రాసెస్ పూర్తవడానికి 21 రోజులు సమయం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అందరికీ క్యూఆర్ కోడ్ ఉన్న ఏటీఎం కార్డు సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తోంది. కాబట్టి మార్పులు చేసుకున్న తర్వాత మీకు కూడా కొత్త రేషన్ కార్డు ఇదే విధానంలో ఇస్తారు.