త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ | APPSC Group 2 Notification 2023 Latest News | APPSC Latest News today

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఈ గురువారం ఆయన APPSC Group 1 తుది ఫలితాలు విడుదల చేశారు, ఫలితాలు విడుదల తరువాత మీడియాతో మాట్లాడారు. 

గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల కు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 లే కాకుండా డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు (డీఈవో), ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్లు, లైబ్రేరియన్లు తదితరాలు కలిపి 1,199 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. వీటితోపాటు 2020 అసిస్టెంట్ ప్రొఫెసర్, 220 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వనున్నామని వెల్లడించారు. 17 ఏళ్ల తర్వాత ఈ పోస్టుల భర్తీ చేపడుతున్నామని చెప్పారు. 

ఈ క్రమంలో గ్రూప్-2 పరీక్షల సిలబస్, పరీక్ష విధానంలోనూ మార్పులు చేస్తున్నామన్నారు. పాత సిలబస్ పూర్తిగా డూప్లికేషన్ తో ఉందని.. దీన్ని మార్చాలని అభ్యర్థుల నుంచి వినతులు వచ్చాయన్నారు. 

గ్రూప్-2 లో గతంలో మూడు పేపర్లు ఉండగా ఇప్పుడు రెండు పేపర్స్ గా మార్చమని చెప్పారు .

కొత్త నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు విజయం సాధించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ఏపీపీఎస్సీ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు గతంలో లాగా లోపాలు తలెత్తకుండా అంతర్గత కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *