క్రికెట్ అభిమానులు ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే టోర్నమెంట్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్ – IPL), ఇప్పుడు 2025 సీజన్ లో చివరి దశకు చేరుకుంది. ఈ లీగ్ ప్రారంభంలోనే చాలా జట్లు పైన భారీ అంచనాలు ఉంటాయి. అయినప్పటికీ కొన్ని జట్లు విఫలమయ్యాయి. ఎట్టకేలకు ప్లే ఆప్స్ కు నాలుగు జట్లు అర్హత సాధించిన విషయం మీ అందరికీ తెలిసిందే..
ప్రతి సంవత్సరం చాలా జట్లు పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, కొన్ని జట్లు అంచనాలను అందుకోలేవు. కొన్ని జట్లపై అంచనాలు లేకపోయినా అంచనాలకు మించి ఆడుతాయి. ఉదాహరణకు ఈ సంవత్సరం సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని మ్యాచ్లలో ఈ జట్టు చాలా బాగా ఆడినప్పటికీ ప్లే ఆప్స్ కు చేరుకోవాల్సిన పాయింట్లు పొందలేక లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం మీ అందరికీ తెలిసిందే.
Who Will Win IPL 2025 | IPL Winner 2025 :
ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లు ఆధారంగా టీముల ప్రదర్శనలు, ఆటగాళ్ల ఫామ్, మరియు ఇతర అంశాలు ఆధారంగా మేము ఎవరు టైటిల్ గెలవగలరనే అంశంపై టైటిల్ ఎవరు గెలవచ్చు అనే అంశంపై అవగాహన కోసం మేము అందించిన ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..
🏹 వివిధ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాల సమాచారం మీ మొబైల్ లో వాట్సాప్ కి రావాలి అంటే వెంటనే క్రింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి..
✅ Join Our What’s Channel – Click here
ప్రస్తుతం ప్లే ఆఫ్ దశకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PK), ముంబై ఇండియన్స్ (MI) మరియు గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు చేరాయి. జట్లు వారీగా బలాబలాలు చూస్తే…..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) :
ఐపీఎల్ చరిత్రలో ఒక్క సారి కూడా ఈ జట్టు కప్ కొట్టలేదు. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అసాధారణ ప్రదర్శన చేస్తూ లీగ్ దశను టాప్-2 కు చేరుకుంది. బ్యాటింగ్‌లో RCB ప్లేయర్స్ అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లో ఉండడంతో RCB అభిమానులు ఈ సాల కప్ నందే అంటున్నారు..
పంజాబ్ కింగ్స్ :
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఈ జట్టు కూడా కప్ కొట్టలేదు. స్టెబుల్ బ్యాటింగ్ లైనప్‌తో పాటు బౌలింగ్ విభాగంలో కూడా పంజాబ్ ఆకర్షణీయంగా రాణిస్తూ వస్తుంది. మాథ్యూ హెడెన్ యొక్క అభిప్రాయం ప్రకారం, శ్రేయస్ యొక్క వ్యూహాత్మక నాయకత్వం విజయవంతంగా పంజాబ్‌ను ముందుకు నడిపిస్తోంది.
ముంబై ఇండియన్స్ :
ఐదు టైటిల్స్ గెలిచిన ఈ జట్టు, ఈ సీజన్‌లో మొదట్లో బలహీనంగా కనిపించినా, తరువాత నిలదొక్కుకొని ప్లేఆఫ్ దశకు చేరింది. బెట్టింగ్ మార్కెట్‌లో ముంబై ఇండియన్స్‌కు 30% అవకాశాలు ఉన్నాయని చెప్పబడింది. ఈ టీంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు మళ్లీ ఫామ్‌లోకి వస్తే, టైటిల్ గెలిచే అవకాశాలు మెరుగవుతాయి.
3) గుజరాత్ టైటాన్స్ :
శుభమన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ కూడా నిలకడగా ప్రదర్శన ఇస్తోంది. ముఖ్యంగా సాయి సుదర్శన్, శుభమన్ గిల్ ఫామ్ ఈ జట్టుకు కలిసొస్తుంది. బౌలింగ్ లో ప్రసిద్ధ్ కృష్ణ మరియు సిరాజ్ మంచి ప్రదర్శన చేస్తున్నారు.
ఐపీఎల్ క్వాలిఫైయర్ మ్యాచ్ – 1 :
RCB తో జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతులెత్తేసింది. RCB బౌలర్లు దాటికి 14.1 ఓవర్లలో కేవలం 101 పరుగులు మాత్రమే చేయగలిగింది.. RCB జట్టు 8 వికెట్ల తేడాతో పది ఓవర్లలోనే సునాయసంగా లక్ష్యాన్ని చేదించి మ్యాచ్ ముగించేసింది.. RCB గెలుపొంది ఫైనల్ కు చేరుకుంది.
ఐపీఎల్ క్వాలిఫైయర్ మ్యాచ్ – 2 :
ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్టుతో పోటీపడుతుంది. గెలిచిన జట్టు క్వాలిఫైయర్ మ్యాచ్ – 1 లో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ తో ఆడాలి.
జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరిది గెలుపు ? :
జ్యోతిషశాస్త్ర నిపుణుల ప్రకారం, ముంబై ఇండియన్స్‌కు 60% అవకాశాలు ఉన్నాయని, ఆ తరువాత RCBకు 50% అవకాశాలు ఉన్నాయని అంచనా వేయబడింది. 18 సంవత్సరాల నిరీక్షణకు తెరదించి కప్పు కొట్టాలని RCB అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుత జట్లు బలలు పరిగణలోకి తీసుకుంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవగలవన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఐపీఎల్ అనేది సర్ప్రైజ్ లతో నిండిన టోర్నమెంట్ కాబట్టి పంజాబ్ కింగ్స్ లేదా గుజరాత్ టైటాన్స్ కూడా ఫైనల్‌లో ఆశ్చర్యకరంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
మరి మీరు ఏ జట్టు గెలుస్తుందని భావిస్తున్నారు ? కామెంట్ చేయండి..
గమనిక :
క్రికెట్ లో గెలుపోటములు సహజం. కాబట్టి ఏ జట్టు గెలిచినా అభిమానులు క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలి.