ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వ స్కూల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో నోటిఫికేషన్ విడుదల | Latest Jobs Notifications in Telugu | Sainik school Kalikiri Recruitment

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో గల సైనిక్ స్కూల్ కలికిరి నందు వివిధ  అకడమిక్ మరియు అడ్మిన్ స్టాఫ్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🏹 ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here 

🏹 AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • సైనిక్ స్కూల్ కలికిరి ,అన్నమయ్య జిల్లా సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 07

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • స్కూల్ మెడికల్ ఆఫీసర్ – 1
  • PGT ( కంప్యూటర్ సైన్స్ ) -1 
  • PGT ( మాథెమాటిక్స్ ) -1
  • TGT  ( సోషల్ సైన్స్ ) -1 
  • PTI కమ్ మాట్రన్ ( ఫిమేల్ ) -1 
  • కౌన్సిలర్ -1 
  • హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ -1 

🔥 విద్యార్హత :

  1. స్కూల్ మెడికల్ ఆఫీసర్ :
  • ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
  1. PGT (కంప్యూటర్ సైన్స్) : 
  • కంప్యూటర్ విభాగం లో బి.ఈ / బి.టెక్ లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి. 
  1. PGT (మాథెమాటిక్స్ ) : 
  • సంబంధిత  మాథెమాటిక్స్ విభాగంలో ఎం. ఎస్సీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
  1. TGT  (సోషల్ సైన్స్) : 
  • సోషల్ సైన్స్ విభాగంలో 50 శాతం మార్కులతో బి ఎ మరియు బిఈడి ఉత్తీర్ణత సాధించాలి.
  1. PTI కమ్ మాట్రన్ ( ఫిమేల్ ) : 
  • బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి వుండాలి.
  1. కౌన్సిలర్ :
  • సైకాలజీ విభాగంలో ఎం.ఏ లేదా ఎం.ఎస్సీ ఉత్తీర్ణత లేదా క్లినికల్ సైకాలజీ లో పీజీ డిప్లొమా లేదా ఎం ఏ ఉత్తీర్ణత సాధించాలి. లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
  1. హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ : 
  • ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి , హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ గా స్కూల్ లేదా హార్స్ రైడింగ్ క్లబ్ లో పనిచేసిన అనుభవం కలిగి వుండాలి.

🔥 వయస్సు:

  • స్కూల్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి 50 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • PGT ( కంప్యూటర్ సైన్స్ ) & PGT ( మాథెమాటిక్స్ ) ఉద్యోగానికి 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలలోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • TGT  ( సోషల్ సైన్స్ ) PTI కమ్ మాట్రన్ ( ఫిమేల్) ఉద్యోగానికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు గా వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కౌన్సిలర్ : 26 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్: 21 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు నిర్ధారణకు 10/01/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ధారించారు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవలెను. అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకోవలెను.
  • ఫిల్ చేసిన దరఖాస్తు ఫారం ను , 30 రూపాయల స్టాంప్ అతికించి:, ఎన్వలప్ లో కార్యాలయ చిరునామాకు పంపించాలి.

🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా:

  • The Principal, Sainik School Kalikiri, Annamayya Dist, Andhra Pradesh PIN: 517234.

🔥 అప్లికేషన్ ఫీజు :    

  • జనరల్ , ఓబిసి, అభ్యర్థులు 500/- రూపాయలు & ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 250/- రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ పేరు మీదుగా అప్లికేషన్ ఫీజు పే చేయాలి. 

🔥 జీతం:

  • అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా 38,000 /- రూపాయల నుండి 70,000/- వరకు జీతం లభిస్తుంది. 

 🔥 ముఖ్యమైన తేదీలు:

  • ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు కార్యాలయ చిరునామాకు చేరడానికి చివరి తేది : 10/01/2025

👉  Click here for notification

👉 Click here for official website 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *