ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఐసీడీఎస్ ప్రాజెక్టులలో మెయిన్ అంగన్వాడి కార్యకర్తలు, మిని అంగన్వాడి కార్యకర్తలు & అంగన్వాడి అయాలు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 68 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అక్టోబర్ 21వ తేదీలకు అప్లై చేయాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఐసిడిఎస్, నంద్యాల
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- మెయిన్ అంగన్వాడి కార్యకర్తలు
- మినీ అంగన్వాడీ కార్యకర్తలు
- అంగన్వాడి ఆయాలు
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :68
- మెయిన్ అంగన్వాడి కార్యకర్తలు -06
- మినీ అంగన్వాడీ కార్యకర్తలు – 02
- అంగన్వాడి ఆయాలు – 60
🔥 విద్యార్హతలు :
- అంగన్వాడి కార్యకర్త: 10 వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి
- మినీ అంగన్వాడీ కార్యకర్త & అంగన్వాడి ఆయా : 10 వ తరగతి ఉత్తీర్ణత కావాలి.ఒకవేళ 10 వ తరగతి వాళ్ళు ఎవరు లేకపోతే ఎక్కువ చదువు చదివిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
🔥వయస్సు:
- 21 నుండి 35 సంవత్సరాల లోపు వయసు వుండాలి.
- ఎస్సీ, ఎస్టీ జనావాస ప్రాంతాలలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థిని లు లేనిచో 18 సంవత్సరాలు నిండిన వారిని పరిగణిస్తారు.
- వయసు లెక్కింపు కి కట్ఆఫ్ తేదిగా 01.07.2024 గా పరిగణిస్తారు.
- అభ్యర్థినిలు తప్పనిసరిగా వివాహితురాలు అయి వుండాలి మరియు స్థానిక నివాసితురాలై వుండాలి.
🔥దరఖాస్తు విధానం:
- అభ్యర్థినిలు దరఖాస్తును ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలి.
- దరఖాస్తు తో పాటు సంబంధిత దృవపత్రాలు ( సెల్ఫ్ అటెస్టడ్ కాపీస్) సీ.డీ.పీ.వో కార్యాలయానికి 10.10.2024 ఉదయం 10:30 గంటల నుండి 21.10.2024 సాయంత్రం 5:00 గంటల లోగా పనివేళల లో సమర్పించాలి
🔥 దరఖాస్తు తో పాటు జతపరవలసిన దృవపత్రాలు:
- పుట్టిన తేది/ వయసు దృవీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- విద్యార్హత దృవీకరణ పత్రం : S.S.C
- నివాస ధ్రువీకరణ పత్రం
- వితంతువు అయిన చో భర్త మరణ దృవీకరణ పత్రం& పిల్లల వయస్సు 18 సంవత్సరాలు వున్నచో వారి వయసు దృవీకరణ పత్రం
- వికలాంగులు అయినచో PH సర్టిఫికెట్
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
🔥 ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు కొరకు ప్రారంభ తేది: 10.10.2024 ఉదయం 10:00 గంటల నుండి.
- దరఖాస్తు కొరకు చివరి తేది:21.10.2024 సాయంత్రం 5:00 గంటలు వరకు.