ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం పీఎం విద్యాలక్ష్మి పథకం : మీరు మెడిసిన్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్, హోటల్ మేనేజ్మెంట్ వంటి ఉన్నతమైన చదువులు చదవాలి అనుకుంటున్నారా ? ఇలాంటి కోర్సులు చేయడానికి ఆర్థికంగా సాధ్యపడడం లేదా ? అయితే మీలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి పథకంకు శ్రీకారం చుట్టింది.
పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా బ్యాంకులు ఉన్నత విద్య అభ్యసించే వారికి రుణాన్ని మంజూరు చేస్తాయి. ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు తోడ్పాటును అందిస్తాయి.
ఈ పథకానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే వారికి ఈ సమాచారాన్ని షేర్ చేయండి..
✅ పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ మరియు స్టైఫెండ్ ఇస్తున్నారు – Click here
పీఎం విద్యాలక్ష్మి పథకం వివరాలు :
- మెడిసిన్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్, హోటల్ మేనేజ్మెంట్ వంటి ఉన్నతమైన చదువులు చదవాలి అనుకునే వారికి ఈ పథకం ఓ వరం.
- పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా 86 రకాల రుణాలు మంజూరు చేస్తారు.
- ఈ పథకంలో భాగంగా దేశంలో 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన వారికి ఎటువంటి సెక్యూరిటీ లేదా గ్యారంటీ రుణాలు మంజూరు చేస్తారు.
- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అందించే కోర్సులకు కూడా కొన్ని షరతులు మరియు నిబంధనలకు అనుగుణంగా ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేస్తారు.
- కానీ ఈ పథకం ద్వారా విదేశాల్లో చదువుకునే వారు మాత్రం తప్పనిసరిగా సెక్యూరిటీ చూపించగలగాలి.
- ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీకే 10 లక్షల నుండి 16 లక్షలు వరకు రుణం మంజూరు చేస్తారు.
- తీసుకున్న రుణం తీర్చడానికి 15 సంవత్సరాలు వరకు సమయం ఇస్తారు. మొదటి సంవత్సరం వడ్డీలో మినహాయింపు కూడా ఇస్తారు.
- ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం లక్ష మంది లబ్ధి పొందుతున్నారు.
- ఎక్కువగా అమ్మాయిలకు ప్రాధాన్యత ఇస్తున్నారు
పీఎం విద్యాలక్ష్మి పథకం కు ఎలా అప్లై చేయాలి ?
- ఈ పథకానికి అప్లై చేయడానికి పీఎం విద్యాలక్ష్మి పథకం వెబ్సైట్ లో అప్లై చేయాల్సి ఉంటుంది.
- ముందుగా వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అప్లికేషన్ ఫారం నింపాలి.. అప్లికేషన్ బ్యాంక్ కు సబ్మిట్ చేయాలి.
- ✅ Apply Link – Click here
అన్ని బ్యాంకుల్లో పీఎం విద్యాలక్ష్మి పథకం రుణాలు మంజూరు :
- కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు ఈ పథకంలో భాగంగా రుణాలు మంజూరు చేయాలని ఆదేశాలు జారీచేశాయి.
- ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరంలో అన్ని బ్యాంకులు ఎక్కువ సంఖ్యలో ఈ పథకంలో భాగంగా రుణాలు మంజూరు చేయాలని భావిస్తున్నాయి. కాబట్టి మీకు దగ్గరలో ఉండే బ్యాంకు ద్వారా ఈ రుణాలు మంజూరు కాబట్టి మీకు దగ్గరలో ఉండే బ్యాంకు ద్వారా పీఎం విద్యాలక్ష్మి రుణం పొందవచ్చు.
పీఎం విద్యాలక్ష్మి పథకం కు ఎవరు అర్హులు ?
- విద్యార్థి చేరబోయే కోర్సును బట్టి పదో తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల వరకు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం లో భాగంగా రుణాలు మంజూరు చేస్తారు.
- మెరిట్ ఆధారంగా సీటు వచ్చిన వారికి మాత్రమే ఈ పథకానికి అర్హత ఉంటుంది. డొనేషన్ ద్వారా సీటు పొందిన వారికి ఈ పథకానికి అర్హత లేదు.
పీఎం విద్యాలక్ష్మి పథకం కు అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే :
ఈ పథకానికి అర్హత కలిగి ఉండాలంటే తప్పనిసరిగా దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, పదో తరగతి లేదా 12వ తరగతి సర్టిఫికెట్, ప్రవేశం పొందిన ఇన్స్టిట్యూట్ నుండి అడ్మిషన్ కార్డు మరియు ఫీజు వివరాలతో అప్లై చేయాలి.
✅ Official Website – Click here