ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం నిధులు కోసం అర్హులైన రైతులు ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా అర్హులైన రైతుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది.
రైతులు పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాలకు అర్హత కలిగి ఉన్నారో లేదో మూడు రకాలుగా తెలుసుకోవచ్చు.
✅ Join Our What’sApp Group – Click here
అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకోండిలా :
- మీకు దగ్గరగా ఉన్న రైతు సేవా కేంద్రంలో సంప్రదించి అక్కడ ఉన్న అర్హులు జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
- అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకునేందుకు https://annadathasukhibhava.ap.gov.in/know-your-status లింకు పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ మరియు అక్కడ వచ్చిన Captch ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన మన మిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు. దీనికోసం రైతులు తమ మొబైల్ లో వాట్సాప్ ఓపెన్ చేసి 95523 00009 నంబర్ కు ” Hi ” అని మెసేజ్ చేయాలి. అక్కడ వచ్చిన సేవలు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. డ్రాప్ డౌన్ లో ఉన్న అన్నదాత సుఖీభవ పథకం పై క్లిక్ చేయాలి. తరువాత స్థితిని తనిఖీ చేయండి అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి పైన క్లిక్ చేసినట్లయితే రైతు పేరు, తండ్రి పేరు, గ్రామం, మండలం, జిల్లా వివరాలు కనిపిస్తాయి. ఇలా మీ వివరాలు కనిపిస్తే మీ పేరు అర్హులు జాబితాలో ఉన్నట్లే.
అర్హులు జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలి ?
- పైన తెలిపిన పద్ధతుల్లో మీరు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నారు లేదో తెలుసుకున్న తర్వాత మీ పేరు లిస్టులో లేకపోతే జూలై 13వ తేదీ లోపు రైతు సేవా కేంద్రంలో గ్రీవెన్స్ పెట్టుకోవాలి. అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి అర్హత ఉంటే అర్హత ఉన్న వారి లిస్టులో చేర్చుతారు. కాబట్టి త్వరగా మీ స్టేటస్ చెక్ చేసుకోండి.
పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం అర్హులకు ఎంత జమ చేస్తారు ?
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యువజన పథకం ద్వారా అర్హులైన రైతుల అకౌంట్లో సంవత్సరానికి 6000 రూపాయలను జమ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 14000 రూపాయలను జమ చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఈ నిధులను జమ చేస్తుంది. ప్రతి విడుదల ₹2,000 రూపాయలు జమ చేస్తారు. అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ₹2,000 ను అర్హత ఉన్న రైతుల అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిషన్ పథకంలో భాగంగా జమ చేస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు రైతుల అకౌంట్లో జమ అయ్యే సమయంలోనే అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా జమ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో ఐదు వేల రూపాయలను పిఎం కిసాన్ నిధులు జమ చేసే సమయంలో రైతుల అకౌంట్లో జమ చేస్తుంది.
అంటే మొదటి విడతలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కలిపి ₹7,000 అర్హులైన రైతుల అకౌంట్లో జమకాలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను ఈనెల 18 లేదా ఆ తరువాత విడుదల చేయనుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ తేదీల్లోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనుంది..
గమనిక :
అన్నదాత సుఖీభవ పథకం నిధులు కోసం ఎదురుచూస్తున్న రైతులు తప్పనిసరిగా పైన తెలిపిన మూడు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి ద్వారా మీరు ఈ పథకానికి అర్హత కలిగి ఉన్నారా లేదా అనేది ముందుగా తెలుసుకోండి. లిస్టులో పేరు ఉంటే పర్వాలేదు. మీ పేరు లేకపోతే తప్పనిసరిగా జూలై 13వ తేదీ లోపు మీకు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో సంప్రదించి గ్రీవెన్స్ పెట్టుకోండి.