అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా విడుదల | ఇలా చేయకపోతే మీకు డబ్బులు రావు | Annadata Sukhibhava Scheme E-KYC Process

అన్నదాత సుఖీభవ పథకం
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలు పథకాలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం , అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా త్వరలో అమలు చేయనుంది. జూన్ 20వ తేదీన అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్స్ లో మొదటి విడత నిధులను ప్రభుత్వం జమ చేయనుంది.

ఈ పథకానికి అర్హత ఉన్నవారు అన్నదాత సుఖీభవ పథకం జాబితాలో తమ పేరు ఉందో లేదో ముందుగానే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పథకం అమలు కావాలి అంటే లబ్ధిదారులు తప్పనిసరిగా E-KYC కూడా పూర్తి చేయాలి..

జాబితాలో పేరు ఎలా చెక్ చేయాలి ? ఈ పథకానికి అర్హతలు ఏమిటి ? వీటితోపాటు మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకోండి. ఈ ఆర్టికల్ చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకునే వారందరికీ తప్పనిసరిగా మీకు తెలిసిన సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేసి అందరికీ సహాయం చేయండి.

ప్రతి రోజూ మీ మొబైల్ లో వాట్సాప్ కు వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం రావాలి అంటే క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూప్ లో ఉచితంగా జాయిన్ అవ్వండి.. మీ మొబైల్ నెంబర్ ఎవ్వరికీ కనిపించదు.

అన్నదాత సుఖీభవ పథకం అర్హతలు :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు ఈ పథకానికి అర్హులు
  • భూమి పట్టాదారులు మరియు కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులే
  • అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ది పొందాలి అంటే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం కోసం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి కూడా అర్హత కలిగి ఉండాలి.
  • లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్ మరియు ఆధార్ లింక్ అయి ఉండాలి.
  • EKYC కూడా పూర్తి చేసుకుని ఉండాలి.

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా జరిగే లబ్ధి :

అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్న రైతులకు మూడు విడతల్లో మొత్తం 20,000/- రూపాయలు లబ్ధి చేకూరనుంది. ఇందులో మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 5,000/- రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వ వాటా 2,000/- రూపాయలు కలిపి మొత్తం 7,000/- రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తారు. మరో రెండు విడతల్లో మిగతా డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది.

🏹 ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళల అకౌంట్స్ లో నెలకు 1500/- రూపాయలు జమ – Click here

అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితా వివరాలు :

అన్నదాత సుఖీభవ పథకం మరియు పీఎం కిసాన్ మీరు అర్హులా ? కాదా? అనే వివరాలు మీరు రెండు పద్ధతులు ద్వారా తెలుసుకోవచ్చు

  • https://pmkisan.gov.in వెబ్సైట్ లో పీఎం కిసాన్ పథకం స్టేటస్ తెలుసుకోవచ్చు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్నదాత సుఖీభవ వెబ్సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ ద్వారా కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు..

అన్నదాత సుఖీభవ పథకం కోసం E-KYC చేసుకునే విధానం :

అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన వారు తమ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ వేయాలి. బయోమెట్రిక్ వేయని రైతులను అనర్హులుగా గుర్తించి ప్రభుత్వం నుండి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రావు. కాబట్టి ప్రతి రైతు తమ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం లేదా రైతు సేవా కేంద్రంలో E-KYC తప్పనిసరిగా పూర్తి చేసుకోండి. మీరు వెళ్లేటప్పుడు మీ ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *