విద్యార్థులకు గుడ్ న్యూస్ ! కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన సమాచారం ప్రకారం కేంద్రం మరియు రాష్ట్రం కలిసి ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించేందుకు విద్యార్ధి విజ్ఞాన్ మందన్ (Vidyarthi Vigyan Manthan) అనే పేరుతో స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నారు.. ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ జరుగుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ టెస్టు రాయవచ్చు. విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్కాలర్షిప్ టెస్ట్ కోసం అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. అప్లై చేసే సమయంలో విద్యార్థులు 200/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
Table of Contents :
రెండు విభాగాల్లో Vidyarthi Vigyan Manthan స్కాలర్షిప్ పరీక్షలు :
- జూనియర్ విభాగంలో 6 నుండి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు , సీనియర్ విభాగంలో 9 నుండి 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.
- ఈ పరీక్షలు ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు తెలుగు భాషలో కూడా నిర్వహిస్తారు.
- ఈ పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ తో పాటు నగదు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది..
Vidyarthi Vigyan Manthan పరీక్షలు జరిగే తేదీలు ఇవే :
- జూనియర్ విభాగం విద్యార్థులకు అక్టోబర్ 28వ తేదీ నుండి నవంబర్ రెండవ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
- సీనియర్ విభాగం విద్యార్థులకు నవంబర్ 19 నుండి 23వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
- విద్యార్థులు తమకు నచ్చిన తేదీల్లో పరీక్ష రాసుకునే అవకాశం ఉంటుంది.
- ఆగస్ట్ 16వ తేదీ నుండి VVM వెబ్సైట్లో విద్యార్థులు ఈ పరీక్షకు సిద్ధం కావడానికి అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచుతారు.
- సెప్టెంబర్ 1వ తేదీన మోడల్ పరీక్షలు నిర్వహిస్తారు..
✅ 10,277 క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here
Vidyarthi Vigyan Manthan పరీక్ష ద్వారా స్కూల్ , జిల్లా, రాష్ట్రస్థాయిలో విద్యార్థులు ఎంపిక :
- పరీక్షలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను స్కూల్ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఎంపిక చేస్తారు.
- స్కూల్ స్థాయిలో 18 మందిని, జిల్లా స్థాయిలో సబ్జెక్టుకు ముగ్గురును రాష్ట్రస్థాయిలో 20 మందిని ఎంపిక చేస్తారు.
- ఇలా ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేస్తారు.
- రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు కు వరుసగా 5000/-, 3,000/- , 2000/- రూపాయలు చొప్పున నగదు బహుమతి ఇస్తారు.
- జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురికి 25,000/- , 15,000/- , 10,000/- చొప్పున వరకు నగదు బహుమతి ఇస్తారు. దీంతోపాటు జాతీయ స్థాయిలో బ్రతుకు చూపిన విద్యార్థులకు భాస్కర స్కాలర్షిప్ పేరిట నెలకు ₹2000 చొప్పున సంవత్సరం పాటు స్కాలర్షిప్ ఇస్తారు.
- జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురికి 25,000/- , 15,000/- , 10,000/- చొప్పున నగదు బహుమతి ఇస్తారు. దీంతోపాటు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు భాస్కర స్కాలర్షిప్ పేరిట నెలకు ₹2000 చొప్పున సంవత్సరం పాటు స్కాలర్షిప్ ఇస్తారు.
🏹 Official Website – Click here