తిరుమల తిరుపతి దేవస్థానం కు చెందిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి నర్సింగ్ అప్రెంటిస్ (SVIMS Nursing Apprentice Notification 2025) పోస్టుల కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నర్సింగ్ అప్రెంటిస్ కు హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు.
నోటిఫికేషన్ కు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
✅ Join Our Telegram Group – Click here
🏹 SVIMS Nursing Apprentice Notification నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
🏹SVIMS Nursing Apprentice Notification మొత్తం ఖాళీలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 అప్రెంటిస్ సీట్లు భర్తీ చేస్తున్నారు.
🏹SVIMS Nursing Apprentice పోస్టులకు ఉండవలసిన విద్యార్హతలు :
- ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ కు బిఎస్సి నర్సింగ్ లేదా బిఎస్సి హానర్స్ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి.
- 2021 తర్వాత బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులు.
🏹 SVIMS Nursing Apprentice పోస్టులకు ఉండవలసిన వయస్సు :
- 31-06-2025 తేదీ నాటికి 21 నుండి 27 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది. బీసీ అభ్యర్థులకు వయసులో మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది. PwBD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
🏹 అప్లికేషన్ విధానము :
- అర్హత ఉన్నవారు NATS వెబ్సైట్లో జూలై 30వ తేదీ లోపు అప్లై చేసి అప్లికేషన్ ప్రింట్ పైన 12 సంఖ్యల ఎన్రోల్మెంట్ ఐడి రాసి ఆగస్టు 4వ తేదిలోపు పోస్ట్ ద్వారా పంపవచ్చు లేదా స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయవచ్చు.
- అప్లికేషన్ అందజేయాల్సిన లేదా పంపించవలసిన చిరునామా : The Registrar, C-fAR building, SVIMS, Alipiri Road, Tirupati – 517 507
🏹 ఎంపిక విధానము :
- అర్హత ఉన్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🏹 అప్లికేషన్ ఫీజు వివరాలు :
- UR – GST తో కలిపి 590/-
- SC / ST / OBC / EWS / PwBD అభ్యర్థులకు GST తో కలిపి అప్లికేషన్ ఫీజు – 354/-
🏹 స్టైఫండ్ వివరాలు :
- ఎంపికైన వారికి నెలకు 21,500/- స్టైఫండ్ ఇస్తారు.
✅ Download Notification – Click here
✅ Official Website – Click here