Today Gold Rates in Telugu States :
బంగారం కొనాలి అనుకునే వారికి ఒక మంచి శుభవార్త ! ప్రస్తుతం రోజు వారిగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం మరియు వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గతంలో ఒక తులం బంగారం ధర లక్ష రూపాయలకు దాటి పెరగగా, ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతూ రావడంతో ప్రజలు బంగారం కొనేందుకు గాను ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం బంగారం ధర మరియు వెండి ధర లను తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 భారతదేశం లో తగ్గుతున్న బంగారం ధరలు :
- ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారం ధరలు ఒక్క సారిగా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. గత నెలలో లక్ష దాటిన 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 93,000/- రూపాయలు కి చేరింది.
- బంగారం కొనాలి అనుకుంటున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృశ్యా మరికొన్ని రోజులు బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం కనబడుతుంది.
- దగ్గరలో శుభకార్యాలు చేయాల్సిన వారు మరియు బంగారం కొనాలి అనుకుంటున్న వారు వీలైనంత త్వరగా బంగారం కొనిపెట్టుకుంటే మంచిది.
- బంగారం ధర పెరిగే లోగా కొనుక్కుంటే జనాలకు ఆశాజనకం గా ఉంటుంది. మళ్ళీ బంగారం ధర పెరిగితే కొనుక్కొనే అవకాశాన్ని చేజార్చుకున్న వారు అవుతారు.
🔥 నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి : Gold Rates in Hyderabad
- తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరం అయిన హైదరాబాద్ లో నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 93,930/- రూపాయలు గా ఉంది.
- 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 86100/- రూపాయలు గా ఉంది.
- 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 70,450/- రూపాయలు గా ఉంది.
- ఈ రోజు నిన్నటి కంటే ఇంకా తక్కువగా 10 రూపాయల చొప్పున ధర తగ్గింది. 24 క్యారెట్ల ధర 93,920 రూపాయలు & 22 క్యారెట్ల ధర 86,090 రూపాయలు & 18 క్యారెట్ల ధర 70,440 రూపాయలు గా ట్రేడ్ అవుతుంది.
🔥 వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి : Silver Rates in Hyderabad
- హైదరాబాద్ లో నిన్నటి రోజున 100 గ్రాముల వెండి ధర 10,800/- రూపాయల గా ఉంది. KG వెండి 1,08,000/- గా ఉంది.
- ప్రస్తుతం ఈ రోజు వెండి ధర కూడా 100 గ్రాముల పై 10 రూపాయల తగ్గుదల చూపింది. దీనితో 100 గ్రాముల వెండి ధర 10790/- రూపాయలు గా, KG వెండి ధర 107900/- రూపాయలు గా ఉంది.