తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ కోసం జాబ్స్ క్యాలెండర్ (Telangana Jobs Calendar 2025) విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగాలు భర్తీ మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై గురువారం మంత్రిమండలి భేటీ జరిగింది. మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి గారు మీడియాకు వెల్లడించారు.
మంత్రులు చేసిన వివరాలు ప్రకారం 2026 మార్చి నాటికి లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించినట్టు తెలియజేశారు.
🏹 Join Our Telegram Group – Click here
Telangana Jobs Calendar 2025 Vacancies :
ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసామని తెలియజేశారు. మరో 17,084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశలో ఉందని చెప్పారు. త్వరలో 22,033 పోస్టులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గీకరణ కారణంగా నోటిఫికేషన్స్ విడుదల చేయడంలో కొంత జాప్యం జరిగిందని తెలియజేశారు.