తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను 4,12,724 మంది విద్యార్థులు రాయనున్నారు. ఈ పరీక్షలు మే 22వ తేదీ నుండి జరగనున్నాయి.
పరీక్ష రాయబోయే విద్యార్థుల్లో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 2,49,032 మంది కాగా, ఒకేషనల్ విద్యార్థులు 16,994 మంది ఉన్నారు. వీరిలో 1,91,000 మంది విద్యార్థులు ఏప్రిల్ 22వ తేదీన విడుదల చేసిన ఫలితాల్లో ఫెయిల్ అయ్యారు. అంటే దాదాపుగా 51,000 మంది విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్ష రాయబోతున్నారు.
ఇక సెకండ్ ఇయర్ పరీక్షలు రాయిబోయే విద్యార్థులు వివరాలు చూస్తే, 1,34,341 మంది జనరల్ విద్యార్థులు, 12,357 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు.
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు 4,12,724 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు.
🔥 పరీక్ష కేంద్రాలు మరియు హాల్ టికెట్స్ :
మే 22 నుండి మే 29 వరకు నిర్వహించే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 892 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించేందుకు బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మే 15వ తేది తరువాత హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇస్తారు.