కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఇటీవల డిగ్రీ అర్హతతో CGL, ఇంటర్మీడియట్ విద్యార్హతతో CHSL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సంస్థ పదవ తరగతి విద్యార్థులతో ఉద్యోగం పొందేందుకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (SSC MTS) మరియు హవల్దార్ (CBIC & CBN) నోటిఫికేషన్ విడుదల చేసింది.(SSC MTS & Havaldar Notification 2025)
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1075 హవల్దార్ ఉద్యోగాలతో పాటుగా MTS ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు.
🏹 పదో తరగతి అర్హతతో 1294 ఉద్యోగాలు – Click here
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం అనగా ఈ నోటిఫికేషన్ కి ఎప్పటినుండి దరఖాస్తు చేసుకోవచ్చు ? ఏ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి ? వయో పరిమితి ఎంత ? దరఖాస్తు చేసే విధానం ఏమిటి ? ఎంపిక విధానం ఏమిటి ? దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి ? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికలను చివరి వరకు చదవగలరు.
SSC MTS ఉద్యోగాలకు ఉండాల్సిన అర్హతలు :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత ఉన్న వారు అర్హులు.
SSC MTS Notification 2025 మొత్తం ఖాళీలు :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1075 MTS మరియు హవల్దార్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
SSC MTS ఉద్యోగాలకు Apply చేసే విధానం :
SSC MTS ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు Online విధానంలో SSC అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.
SSC MTS ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు :
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేస్తున్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు 100/- రూపాయలు.
- మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, PWD అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
SSC MTS & హవల్దార్ ఉద్యోగాలకు ఉండవలసిన వయస్సు :
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి విడుదలైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 25 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు.
- హవల్దార్ ఉద్యోగాలు మరియు కొన్ని డిపార్ట్మెంట్లలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 27 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు అర్హులు.
- ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- ఓబీసీ అభ్యర్థులకు వయస్సులో మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాల వయస్సులో సడలింపు ఉంటుంది.
SSC MTS & హవల్దార్ ఉద్యోగాలకు ఎంపిక విధానం :
- SSC MTS ఉద్యోగాలకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తున్నారు.
- హవల్దార్ ఉద్యోగాలకు ఆన్లైన్ పరీక్ష మరియు PET, PST నిర్వహిస్తారు.
SSC MTS & Havaldar Recruitment 2025 Important Dates :
- అప్లికేషన్ ప్రారంభ తేదీ : 26-06-2025
- అప్లికేషన్ చివరి తేదీ : 24-07-2025
- కంప్యూటర్ ఆధారిత పరీక్షల తేదీలు : 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 20వ తేది నుండి అక్టోబర్ 24 తేది వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో SSC MTS & హవాల్దర్ పరీక్ష కేంద్రాలు :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గుంటూరు , కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, ఒంగోలు, శ్రీకాకుళం , ఏలూరు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here