SSC CPO SI Notification 2025 in Telugu | Staff Selection Commission Sub Inspector Notification 2025

SSC CPO SI Recruitment 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

SSC CPO SI Notification 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( SSC ) నుండి సబ్ ఇన్స్పెక్టర్ ( sub inspector in Delhi police and central armed police forces ) ఉద్యోగాల భక్తి కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3073 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గాను ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నవారు కి అవకాశం లభిస్తుంది. ఈ ఈ ఉద్యోగానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? వయో పరిమితి ఎంత ? దరఖాస్తు చేసుకునేందుకుగాను చివరి తేదీ ఏమిటి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ? వంటి అన్ని అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చదవగలరు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నందు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3073 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 వయోపరిమితి :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేందుకు గాను 20 సంవత్సరాలు వయస్సు నిండి యుండి , 25 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/08/2025 ను కట్ ఆఫ్ తేదీ గా పరిగణిస్తారు.
  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి మూడు సంవత్సరాలు వయో సడలింపు లభిస్తుంది.

🔥 విద్యార్హత :

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • విద్యార్హత నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేదీగా 16/10/2025 ను పరిగణిస్తారు.

🔥 దరఖాస్తు విధానము :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. గతంలో వన్ టైం రిజిస్ట్రేషన్ ( OTR ) పూర్తి చేసుకున్న వారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు , వన్ టైప్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని వారు ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని తర్వాత సంబంధిత లాగిన్ వివరాలు తో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

🔥 దరఖాస్తు ఫీజు :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులు 100 రూపాయల దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
  • ఎస్సీ , ఎస్టీ , ఎక్స్ సర్వీస్మెన్ , మహిళలకు దరఖాస్తు ఫీజు నుండి మినహాయింపు కలదు.

🔥 ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ( పేపర్ – 1 & పేపర్ – 2 ) , ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ / ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ , మెడికల్ టెస్ట్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానము :

  • పేపర్ – 1 : ఇందులో భాగంగా మొత్తం 200 మార్కులకు గాను రెండు గంటల సమయం కేటాయించారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ , జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఎవేర్నెస్ , క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్ , ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ విభాగాల నుండి ఒక్కొక్క విభాగం నుండి 50 ప్రశ్నలు , 50 మార్కులుగా అనగా మొత్తం 200 ప్రశ్నలు కు 200 మార్కులుకు గాను ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. 1/4 వంతు నెగిటివ్ మార్కింగ్ విధానం కలదు.
  • పేపర్ – 2 : ఇందులో భాగంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ విభాగం నుండి 200 ప్రశ్నలు ఇస్తారు. 200 మార్కులు కేటాయించగా , రెండు గంటల సమయంలో ఈ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.

🔥 పరీక్షా కేంద్రాలు :

  • దేశంలోని ప్రముఖ నగరాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాలలో పరీక్షా కేంద్రాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
  • ఆంధ్ర ప్రదేశ్ : గుంటూరు , కాకినాడ , కర్నూలు , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , విజయవాడ , విశాఖపట్నం , ఏలూరు , ఒంగోలు లో గల పరీక్షా కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తారు.
  • తెలంగాణ : హైదరాబాద్ / సికింద్రాబాద్ , వరంగల్ , సిద్దిపేట్ నగరాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 26/09/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 16/10/2025 ( రాత్రి 11:00 గంటల లోపు )
  • ఆన్లైన్ విధానం ద్వారా ఫీజు పేమెంట్ చేయడానికి చివరి తేదీ :17/10/2025 ( రాత్రి 11:00 గంటల లోపు )
  • దరఖాస్తులో మార్పులు చేసే చేసేందుకు గాను అవకాశం కల్పించిన తేదీలు : 24/10/2025 నుండి 26/10/2025 ( రాత్రి 11:00 గంటల లోపు )
  • కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహణ : నవంబర్ , డిసెంబర్ 2025

Click here for official notification

Click here to apply

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *