ఇంటర్ అర్హతతో 3131 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | SSC CHSL Notification 2025 Details in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలి అనుకొనే అభ్యర్థులకు శుభవార్త ! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సంస్థ నుండి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (SSC CHSL) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

SSC బోర్డు వారు ప్రతి సంవత్సరం విడుదల చేసే జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదల అవుతాయి. ఈ సారి SSC CHSL నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 3,131 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అనగా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? విద్యార్హత ఎం ఉండాలి? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? అప్లికేషన్ ఫీజు ఎంత చెల్లించాలి వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

SSC CGL, CHSL, MTS, GD ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? మా APP లో ఏ కోర్సు అయినా కేవలం 499/- మాత్రమే.. సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసులు ఉంటాయి. Demo Classes చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోండి..

🔥SSC CHSL నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ బోర్డు వారు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 SSC CHSL నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజనల్ క్లర్క్ , జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ , పోస్టల్ అసిస్టెంట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 SSC CHSL నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3131 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గల అందరు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥SSC CHSL ఉద్యోగాలకు విద్యార్హతలు :

  • CHSL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే వారికి ఇంటర్మీడియట్ విద్యార్హత లేదా తత్సమాన విద్యార్హత కలిగి వుండాలి. తత్సమాన విద్యార్హత అనగా ఐటిఐ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥SSC CHSL ఉద్యోగాలకు ఉండవలసిన వయస్సు :

  • 18 సంవత్సరాలు నిండి యుండి 27 సంవత్సరాలు లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ ఎస్టి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు పది సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥SSC CHSL ఉద్యోగాలకు దరఖాస్తు విధానం :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులు SSC యొక్క కొత్త వెబ్సైట్ నందు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

🔥SSC CHSL ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
  • ఎస్సీ , ఎస్టీ, దివ్యాంగులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వారు కి ఫీజు మినహాయింపు కలదు.
  • మిగతా అభ్యర్థులు అందరూ 100 /- రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

🔥SSC CHSL ఉద్యోగాలకు ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు తీసుకున్నా అభ్యర్థులకు టైర్ -1 మరియు టైర్ – 2 కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అవసరమగు పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

🔥SSC CHSL ఉద్యోగాలకు జీత భత్యాలు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక అయిన వారికి వారు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా జీతం లభిస్తుంది.
  • 50,000 రూపాయల వరకు జీతం లభించవచ్చు.

🔥 SSC CHSL ఉద్యోగాలకు ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 23/06/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 18/07/2025 ( రాత్రి 11:00 గంటల వరకు)
  • ఆన్లైన్ విధానం ద్వారా పేమెంట్ చేయుటకు చివరి తేదీ : 19/07/2025 ( రాత్రి 11:00 గంటల వరకు)
  • అప్లికేషన్ లో తప్పులను సరిదిద్దుటకు అవకాశం : 23/07/2025 నుండి 24/07/2025 ( రాత్రి 11:00 గంటల వరకు)
  • టైర్ – 01 వ్రాత పరీక్ష నిర్వహణ : 08/09/2025 నుండి 18/09/2025 వరకు
  • టైర్ – 02 వ్రాత పరీక్ష నిర్వహణ : ఫిబ్రవరి & మార్చ్ 2025

👉 Click here for notification

👉 Click here to Apply

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *