SSC నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | SSC CGL Notification 2025 | Staff Selection Commision CGL Notification 2025

SSC CGL Notification 2025 in Telugu
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రముఖ సంస్థ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నుండి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ (CGL) ఉద్యోగాల భర్తీ చేసేందుకు గాను భారీ నోటిఫికేషన్ (SSC CGL) విడుదల అయ్యింది. డిగ్రీ అర్హత తో దరఖాస్తు చేసుకొనే ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులు ఎంత గానే ఎదురు చూస్తూ ఉంటారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ , ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ , ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ , సబ్ ఇన్స్పెక్టర్ , ఆడిటర్ , అకౌంటెంట్ , టాక్స్ అసిస్టెంట్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అనగా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయు ఉద్యోగాలు ఏమిటి ? విద్యార్హత ఏమి ఉండాలి ? ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? పరిక్ష ఎప్పుడు నిర్వహిస్తారు వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥SSC CGL ఉద్యోగాలను భర్తీ చేయు సంస్థ :

  • ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఉద్యోగాలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సంస్థ భర్తీ చేస్తుంది.SSC సంస్థ ప్రతీ సంవత్సరం ఈ ఉద్యోగాల భర్తీ కొరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది.ఇందులో భాగంగానే నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 SSC CGL నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • SSC బోర్డు సంస్థ భర్తీ చేసే ఉద్యోగాలలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ (CGL) ఉద్యోగాలు ప్రతిష్టాత్మకమైనవి.
  • ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ , ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ , ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ , సబ్ ఇన్స్పెక్టర్ , ఆడిటర్ , అకౌంటెంట్ , టాక్స్ అసిస్టెంట్ , సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ , అప్పర్ డివిజనల్ క్లర్క్ , స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ – 2 మొదలగు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 SSC CGL నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14,582 ఉద్యోగాలను భర్తీ చేస్తారని ప్రాధమిక సమాచారం.
  • అవసరాన్ని బట్టి ఈ ఉద్యోగాల సంఖ్య పెరగవచ్చు.

🔥SSC CGL ఉద్యోగాలకు విద్యార్హత :

  • SSC CGL ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ (ANY DEGREE) అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥వయోపరిమితి :

  • ఈ నోటిఫికేషన్ కి సంబంధించి 18 సంవత్సరాలు నిండి 32 సంవత్సరాలు లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు , దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు కలదు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/08/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.

🔥 SSC CGL ఉద్యోగాలకు దరఖాస్తు చేయు విధానం :

  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ మరియు My SSC మొబైల్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఇప్పటి వరకు రిజిస్టర్ కాని వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.
  • 09/06/2025 నుండి 04/07/ 2025 లోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

🔥SSC CGL ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 100 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ , ఎస్టీ , దివ్యాంగులు , ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కలదు.

🔥 SSC CGL ఉద్యోగాల ఎంపిక విధానం:

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా టైర్ – 01 మరియు టైర్ – 02 పరీక్షలను నిర్వహిస్తారు.

🔥 SSC CGL టైర్ – 01 వ్రాత పరీక్షా విధానం:

  • టైర్ వన్ రాత పరీక్షలో 200 మార్కులు గాను నిర్వహిస్తారు. ఒక గంటపాటు సమయం ఉంటుంది.
  • ఇందులో జనరల్ ఎవేర్నెస్ , రీజనింగ్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఒక్కొక్క విభాగం నుండి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 బహుళైచ్చక ప్రశ్నలు ఉంటాయి.
  • 1/4 వ వంతు నెగిటివ్ మార్కింగ్ విధానం కలదు అనగా తప్పు సమాధానం గుర్తించిన ప్రతి ప్రశ్నకు 0.50 మార్కులు తొలగించబడతాయి.

🔥SSC CGL టైర్ – 02 వ్రాత పరీక్ష విధానం :

  • టైర్ – 02 పరీక్ష విధానంలో రెండు పేపర్లు ఉంటాయి.
  • పేపర్ – 01 లో రెండు సెషన్స్ ఉంటాయి. సెషన్ -01 లో భాగంగా మ్యాథమెటికల్ ఎబిలిటీ ( 30 ప్రశ్నలు), రీజనింగ్ అండ్ జనరల్ ఇంటిలిజెన్స్ ( 30 ప్రశ్నలు) , ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ (45 ప్రశ్నలు) , జనరల్ అవేర్నెస్ (25 ప్రశ్నలు) కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ (20 ప్రశ్నలు) నుండి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కేటాయించారు.
  • పేపర్ – 01 సెషన్ – 02 లో భాగంగా డేటా ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు.
  • పేపర్ 2 లో స్టాటిస్టిక్స్ విభాగం నుండి 100 ప్రశ్నలు 200 మార్కులు గాను పరీక్ష నిర్వహిస్తారు.

🔥SSC CGL పరీక్షా కేంద్రాలు :

  • దేశం లో అన్ని రాష్ట్రాలలో గల ప్రధాన కేంద్రాలలో ఈ పరీక్ష ను నిర్వహిస్తారు.
  • తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తె ఆంధ్ర ప్రదేశ్ లో చీరాల , గుంటూరు , కాకినాడ , కర్నూల్ , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , విజయనగరం , విజయవాడ , విశాఖపట్నం , శ్రీకాకుళం ,ఏలూరు , ఒంగోలు నందు మరియు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ , కరీంనగర్ నందు పరీక్ష నిర్వహిస్తారు.

🔥SSC CGL ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 09/06/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 04/07/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 05/07/2025
  • టైర్ – 01 వ్రాత పరీక్ష నిర్వహణ: 13 ఆగస్టు 2025 నుండి 30 ఆగస్టు 2025 వరకు.
  • టైర్ – 02 వ్రాత పరీక్ష నిర్వహణ: డిసెంబర్ 2025.

👉 Click here for notification

👉 Click here to apply

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *