ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ పరిధిలో గల సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SEEDAP) సంస్థ నుండి జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఏదైనా డిగ్రీ అంతకుమించి పై చదువులు చదివిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పోస్ట్ చొప్పున రిక్రూట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకం దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన (DDUGKY) ను ప్రభావంతంగా అమలు చేయడం డిస్టిక్ మేనేజర్ల ప్రధాన విధి.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అనగా దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి ? ఉద్యోగ అర్హత ఏమిటి ? వయస్సు ఎంత ఉండాలి ? లభించే జీతం ఎంత ? వంటి వివిధ అంశాలను తెలుసుకోవడం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ AP జైళ్ల శాఖలో 400 వార్డెర్ ఉద్యోగాలు భర్తీ – Click here
Table of Contents :
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ సంస్థ వారు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పంతొమ్మిది ఉద్యోగాలను రాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేస్తున్నారు.
- కాంట్రాక్ట్ ప్రాదిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- SEEDAP సంస్థ జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అనే ఉద్యోగంలో భర్తీ చేస్తున్నారు.
✅ భూమి లేని రైతులకు కూడా అన్నదాత సుఖీభవ – Click here
🔥 అవసరమగు విద్యార్హతలు & అనుభవం :
- ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.
- రూరల్ డెవలప్మెంట్ , సోషియాలజీ , సోషల్ వర్క్ లో మాస్టర్స్ చేసిన వారికి మరియు రూరల్ డెవలప్మెంట్లో టీజీ డిప్లమో పూర్తి చేసిన వారికి లేదా ఎంబీఏ ఉత్తీర్ణమి సాధించిన వారికి ప్రాధాన్యత లభిస్తుంది.
- డిప్లమో ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ / lT/ MIS లేదా MS ఆఫీస్ అండ్ ఐటి టూల్స్ ప్రొఫిషియన్సీ కలిగి వున్న వారికి , ఆరు నెలల సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
🔥 వయో పరిమితి :
- నోటిఫికేషన్ విడుదలైన తేదీ నాటికి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥దరఖాస్తు విధానం :
- అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు SEEDAP అధికారిక మెయిల్ ఐడి recruitment.seedap@gmail.com కి వారి దరఖాస్తు ను పంపించాలి. సబ్జెక్ట్ లో ” Application for the post of jobs District manager , SEEDAP అని ప్రస్తావించాలి.
- దరఖాస్తు ను పంపించేటప్పుడు సంబంధిత ధ్రువపత్రాలు కూడా జత చేయవలసి వుంటుంది.
🔥 జత చేయవలసిన దృవపత్రాలు :
- అప్డేట్ చేయబడిన రెజ్యూమ్
- పదవ తరగతి సర్టిఫికేట్ (వయస్సు నిర్ధారణ కొరకు)
- డిగ్రీ / PG సర్టిఫికెట్
- టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్
- ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్
- కుల దృవీకరణ పత్రం (అవసరమగు వారు)
- సదరం సర్టిఫికేట్ (దివ్యాంగులు వారు )
- ఆధార్ కార్డ్
🔥ఎంపికా విధానం :
- అభ్యర్థులను వారి అకాడమిక్ క్వాలిఫికేషన్ మరియు పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ / డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
🔥 జీతభత్యాలు :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి కన్సాలిడేటెడ్ పే క్రింద ప్రతి నెల 35,000/- రూపాయలు లభిస్తాయి.
- SEEDAP నిబంధనల ప్రకారం అధికారిక టూర్ లు ఉన్నప్పుడు వీరికి TA మరియు DA లు కూడా లభిస్తాయి.
🔥ముఖ్యమైన తేదీలు :
- నోటిఫికేషన్ విడుదలైన తేదీ : 02/08/2025
- దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 04/08/2025
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 15/08/2025 ( సాయంత్రం 05:00 గంటల వరకు )
👉 Click here for official website