ఇంటర్ ఉత్తీర్ణత సాధించి , పై చదువులు చదువుతున్న బాలికల కొరకు సంతూర్ సంస్థ స్కాలర్షిప్ ను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలలో బాలికలకు మాత్రమే సంస్థ ఈ స్కాలర్షిప్ అవకాశం కల్పిస్తుంది.
మొత్తం 1000 మంది బాలికలకు ఈ స్కాలర్షిప్ సౌలభ్యం కల్పించబడింది. ఈ స్కాలర్షిప్ పొందేందుకు ఎవరు అర్హులు ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? స్కాలర్షిప్ మొత్తం ఎంత లభిస్తుంది ? వంటి వివిధ అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents :
🔥 స్కాలర్షిప్ అందచేస్తున్న సంస్థ :
- విప్రో కన్స్యూమర్ కేర్ మరియు విప్రో కేర్స్ సంస్థ సంతూర్ విమెన్స్ స్కాలర్షిప్ పేరు మీదుగా ఈ స్కాలర్షిప్ ను అందిస్తుంది.
🔥 ఈ స్కాలర్షిప్ ఎందుకు ఇస్తున్నారు ? :
- సంతూర్ స్కాలర్‌షిప్ కార్యక్రమం ఒక చొరవ, ఈ కార్యక్రమం 12వ తరగతి తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన బాలికలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం లక్ష్యంగా అమలుచేస్తున్నారు.
🔥 మొత్తం ఎంత మందికి సంతూర్ స్కాలర్షిప్ లభిస్తుంది ? :
- ఆంద్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలలో గల బాలికలకు మొత్తం 1000 మందికి ఈ స్కాలర్షిప్ లభిస్తుంది.
🔥 లభించే స్కాలర్షిప్ మొత్తం :
- ఈ స్కాలర్షిప్ కొరకు ఎంపిక అయిన వారికి సంవత్సరానికి 30,000 వేల రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుంది.
- ఈ స్కాలర్షిప్ మొత్తం కోర్సు మొత్తం పూర్తి అయ్యేంత వరకు లభిస్తుంది.
- విద్యార్థులు ట్యూషన్ ఫీజులు లేదా విద్యకు సంబంధించిన ఇతర ఖర్చుల కోసం ఈ స్కాలర్‌షిప్‌ను ఉపయోగించుకోవచ్చు.
🔥 స్కాలర్షిప్ కొరకు అవసరమగు అర్హతలు :
- ప్రభుత్వ పాఠశాల నుండి 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
- ప్రభుత్వ కాలేజీ నుండి 2024 – 2025 వ విద్యా సంవత్సరం లో 12 వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- 2025 – 26 విద్యా సంవత్సరానికి ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లో నమోదు అయి ఉండాలి. ప్రస్తుతం డిగ్రీ / తత్సమాన అర్హత లో మొదటి సంవత్సరం చదువుతూ వుండాలి.
🔥 దరఖాస్తు విధానం :
- అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకొని , ఫిల్ చేసి , ఆన్లైన్ లో అక్టోబర్ 25 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఈ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 25/10/2025.
