SAIL IISCO Staff Nurse & Paramedics Notification 2025 | SAIL Recruitment 2025

SAIL Staff Nurse Jobs
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

SAIL IISCO Proficiency Trainees Recruitment 2025 : మహారత్న కంపెనీ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( SAIL ) సంస్థ యొక్క IISCO స్టీల్ ప్లాంట్ ( ISP ) నందు ప్రొఫిసియన్సీ ట్రైనీస్ ( నర్సస్ & పారామెడిక్స్ ) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరయ్యి ఈ ఉద్యోగాలను పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 39 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? జీతం ఎంత లభిస్తుంది ? మరియు ఇతర అన్ని విషయాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥SAIL నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ కి సంబంధించిన IISCO స్టీల్ ప్లాంట్ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥SAIL IISCO భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :

  • మొత్తం 39 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలు భర్తీ – Click here

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఓటి టెక్నీషియన్ – 03
  • డ్రెస్సర్ – 02
  • ఎక్స్ రే టెక్నీషియన్ – 02
  • ఈ సి జి టెక్నీషియన్ – 02
  • ఆడియో మెట్రిస్ట్ – 01
  • ఫార్మాసిస్ట్ – 02
  • లాబొరేటరీ & బ్లడ్ సెంటర్ టెక్నీషియన్ -03
  • పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ టెక్నీషియన్ – 01
  • ఆప్టోమెట్రిస్ట్ – 02
  • ఫెల్బాటమిస్ట్ – 02
  • వాక్సినేటర్ – 01
  • డెంటల్ అసిస్టెంట్ / డెంటల్ ఆపరేటింగ్ రూం అసిస్టెంట్ – 01
  • నర్సెస్ – 15
  • డయాలసిస్ టెక్నీషియన్ – 02

🔥 వయో పరిమితి :

  • 30 సంవత్సరాలలోపు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ( 35 సంవత్సరాల వరకు ) & ఓబీసీ ( నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు ( 33 సంవత్సరాల వరకు ) & దివ్యాంగులకు 10 సంవత్సరాలు సంవత్సరాలు ( 40 సంవత్సరాల వరకు ) వయో సడలింపు కలదు.

🔥 విద్యార్హత :

  • ఈ ఉద్యోగాలకు సంబంధించి పోస్ట్ లను అనుసరించి వివిధ విద్యార్హతలను కలిగి వుండాలి.
  • 1.OT Technician: ఇంటర్ (10+2) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండి , ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో కనీసం 2 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • 2.Dresser: ఇంటర్ (10+2) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండి , డ్రెస్సర్ కోర్సులో డిప్లొమా లేదా సర్టిఫికేట్ పొంది ఉండాలి.
  • 3.X-Ray Technician: ఇంటర్ (10+2) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండి, మెడికల్ రేడియాలజీ టెక్నాలజీలో కనీసం 2 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • 4.ECG Technician: ఇంటర్ (10+2) లేదా తత్ సమాన విద్యార్హత కలిగి ఉండి , ECG టెక్నాలజీలో కనీసం 2 సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
  • 5.Audiometrist: ఇంటర్ (10+2) లేదా తత్ సమాన విద్యార్హత కలిగి ఉండి, ఆడియాలజీలో కనీసం 2 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • 6.Pharmacist: ఇంటర్ (10+2) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండి, ఫార్మసీలో డిప్లొమా, స్టేట్ ఫార్మసీ కౌన్సిల్/ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి గా ఉండాలి.
  • 7.Laboratory & Blood Centre Technician: ఇంటర్ (10+2) తత్సమాన విద్యార్హత కలిగి ఉండి, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో కనీసం 2 సంవత్సరాల డిప్లొమా (DMLT) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
    8.Pulmonary Function Test (PFT) Technician: ఇంటర్ (10+2) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండి, పుల్మనరీ ఫంక్షన్ టెస్ట్ టెక్నాలజీలో కనీసం 2 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
    9.Optometrist: ఇంటర్ (10+2) తత్సమాన విద్యార్హత కలిగి ఉండి, ఆప్టోమెట్రీలో కనీసం 2 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
    10.Phlebotomist: ఇంటర్ (10+2) మరియు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో కనీసం 2 సంవత్సరాల డిప్లొమా లేదా 10వ తరగతి మరియు ఫ్లెబోటమీ సర్టిఫికేట్ కోర్సు కలిగి ఉండాలి.
    11.Vaccinator: ఇంటర్ (10+2) సమాన విద్యార్హత కలిగి ఉంద , ANM / GNM / B.Sc. నర్సింగ్ కోర్సు పూర్తిచేసిన వారు, చెల్లుబాటు అయ్యే నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి గా ఉండాలి.
    12.Dental Assistant / Dental Operating Room Assistant: ఇంటర్ (10+2) మరియు డెంటల్ అసిస్టెంట్ కోర్సు (సర్కార్ గుర్తింపు పొందిన సంస్థ నుండి) లేదా OT టెక్నాలజీలో కనీసం 2 సంవత్సరాల డిప్లొమా లేదా డెంటల్ మెకానిక్స్ / డెంటల్ టెక్నీషియన్ కోర్సు లేదా B.Sc. మరియు 3 సంవత్సరాల అనుభవం ప్రభుత్వ/ప్రైవేట్/NABH గుర్తింపు పొందిన ఆసుపత్రిలో చేయాలి.
    13.Nurse: ఇంటర్ (10+2) మరియు GNM (General Nursing and Midwifery) కోర్సు, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తించిన సంస్థ నుండి ఉత్తీర్ణులై ఉండాలి.
    14.Dialysis Technician: ఇంటర్ (10+2) లేదా తత్ సమాన విద్యార్హత కలిగి ఉండి, డయాలిసిస్ టెక్నాలజీలో కనీసం 2 సంవత్సరాల డిప్లొమా మరియు కనీసం 6 నెలల పని అనుభవం.

🔥 దరఖాస్తు చేయు విధానం :

  • అభ్యర్థులు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన దరఖాస్తును ఫిల్ చేసి , వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ నాడు ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశానికి తీసుకొని వెళ్ళాలి.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి , ఎంపిక చేస్తారు.

🔥 వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం & తేదీ & సమయం :

  • walk-in interview at Confluence, SAIL-ISP, Opposite Burnpur Post Office, P.O.- Burnpur -713325, DT: Paschim Bardhaman, West Bengal.
  • నర్సెస్ ఉద్యోగాలకు 16 /09/2025 నాడు మరియు మిగతా అన్ని ఉద్యోగాలకు 15/09/2025 వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి ఉదయం 09:00 నుండి 11:00 గంటల లోపు రిపోర్ట్ చేయాలి.

🔥 జీతభత్యాలు :

  • డయాలసిస్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి అన్ని అలవెన్సులు కలిపి గరిష్టంగా 25,000 రూపాయల వరకు జీతం లభిస్తుంది.
  • మిగతా అన్ని ఉద్యోగాలకు గరిష్టంగా 17,020 రూపాయలు వరకు జీతం లభిస్తుంది.

👉 Click here to download Notification and Application

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!