Railway NTPC (Graduate) Exam Dates :
రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్) ఉద్యోగాల పరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. జూన్ 5వ తేదీ నుండి జూన్ 23వ తేదీ వరకు 15 రోజులు పాటు పరీక్షలు నిర్వహించబోతున్నట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా విడుదల చేసిన నోటీసు ద్వారా తెలియజేసింది.
పరీక్ష తేదీకి పది రోజులు ముందు అభ్యర్థులు తమ పరీక్ష తేదీ మరియు పట్టణం వివరాలు తెలుసుకోవచ్చు.
పరీక్షకు నాలుగు రోజుల ముందు ఈ-కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🏹 ఏపీలో కొత్త రేషన్ కార్డులుకు అప్లై చేయండి – Click here
పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు అభ్యర్థులకు ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు పరీక్షకు వచ్చే సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డుతో హాజరు కావాలి.

ఈ ఉద్యోగాల ఎంపిక పూర్తి పారదర్శకంగా మరియు కంప్యూటర్ ఆధారిత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుందని, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారులు మాటలు నమ్మవద్దని రిక్రూట్మెంట్ బోర్డు తెలియజేసింది.