ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం అర్హతలు , అప్లై విధానము అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే | PM Vidyalaxmi Scheme Details in Telugu

PM Vidyalaxmi Scheme Details

భారత ప్రభుత్వం విద్యార్థుల యొక్క లబ్ది కోసం మరియు ప్రజలందరికీ విద్య అందుబాటులో ఉంచేందుకు వివిధ పథకాలను అమలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి విద్యాలక్ష్మీ (PM Vidyalaxmi Scheme) అనే పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రధాన మంత్రి విద్యాలక్ష్మీ (PM Vidyalaxmi Scheme) ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి హామీ / పూచీకత్తు లేకుండా విద్యార్థులకు అక్షరాల ఏడు లక్షల యాభై వేల రూపాయల (7,50,000/ రూపాయలు) లోన్ ను మంజూరు చేస్తుంది.

ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం (PM Vidyalaxmi Scheme) ద్వారా ఆర్థిక ఇబ్బందులు వలన చదువు కొనసాగించని వారికి వారి ఉన్నత చదువులు కొనసాగించేందుకు మంచి అవకాశం కల్పిస్తున్నారు.

ప్రధాన మంత్రి విద్యా లక్ష్మీ (PM Vidyalaxmi Scheme) పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ? ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? మరియు ఇతర అంశాలు అన్ని కూడా సమగ్రంగా తెలుసుకొనేందుకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🏹 Join Our What’s App Group – Click here

🔥ప్రధానమంత్రి విద్యా లక్ష్మీ పథకం అనగా ఏమిటి ? :

  • ప్రధానమంత్రి విద్యా లక్ష్మీ పథకం ఒక కేంద్ర ప్రభుత్వ పథకం.
  • ఇటీవల రూపొందించబడిన నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ – 2020 సిఫార్సుల ఆధారంగా , వాటిని అనుసరించి రూపొందించారు.
  • ఆర్థిక ఇబ్బందులు వలన పై చదువులు కొనసాగించలేని వారికి లోన్ రూపంలో ఆర్థిక సహాయం అందించి వారి చదువును కొనసాగించేలా చేయడమే, ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
  • ఈ లోన్ పొందేందుకు ఎటువంటి పూచీకత్తు (Guarantee) అవసరం లేదు.

🏹 రైతుల అకౌంట్లో ప్రతీ నెలా 3,000/- జమ అయ్యే పథకం – Click here

🔥 ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం పొందేందుకు అవసరమగు అర్హతలు:

  • లబ్ధిదారులు కచ్చితంగా భారతీయ పౌరులు అయి వుండాలి.
  • ఈ విద్యాలక్ష్మి పథకం దేశం లో అగ్ర శ్రేణి విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది.
  • జాతీయ సంస్థల ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF) లో టాప్ 860 క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లలో అడ్మిషన్ పొందివున్న వారు అర్హులు.
  • గ్రాడ్యుయేషన్ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ , డిప్లమో , ఇంటిగ్రేటెడ్ కోర్సులు వంటివి ఈ పథకం ద్వారా కవర్ చేయబడతాయి.
  • విద్యార్థుల కుటుంబం యొక్క ఆదాయం 8 లక్షల లోపు ఉంటే లోన్ పై గల వడ్డీ సబ్సిడీ లభిస్తుంది .
  • 8 లక్షల కంటే అధిక ఆదాయం కలిగి ఉన్నవారికి లోన్ లభిస్తుంది కానీ వడ్డీ సబ్సిడీ లభించదు.

🔥 ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? :

  • ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకానికి ఆన్లైన్ విధాన ద్వారా అధికారిక పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ముందుగా అధికారిక పోర్టల్ లో ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫారం (CELAF) నింపాలి. ఇందులో భాగంగా ఏ సంస్థలో విద్యను అభ్యసిస్తున్నారు ఏ కోర్సు చేస్తున్నారు అలానే ఇతర ఆర్థిక అంశాలు ప్రస్తావించాలి.
  • ఆ తర్వాత మీరు ఎంత రుణాన్ని పొందాలి అనుకుంటున్నారో ఆ వివరాలు నమోదు చేయాలి.
  • విద్యార్థులు ఈ పథకంలో భాగంగా మూడు విభిన్న రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకంకు అవసరమగు ధ్రువపత్రాలు :

  • విద్యార్థి ప్రస్తుత సంవత్సరం కంటే ముందు చదివిన సెమిస్టర్ యొక్క విద్యా రికార్డులు అనగా మార్క్స్ మెమోలు , పరీక్షా ఫలితాలు అవసరం అవుతాయి.
  • కేవైసీ నమోదు కొరకు ఆధార్ కార్డు , పాన్ కార్డ్ మరియు ఒక అడ్రస్ ప్రూఫ్ అవసరమవుతాయి.
  • అలానే కాలేజీకి సంబంధించి అడ్మిషన్ వివరాలు మరియు కాలేజీ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ కూడా అవసరం.

🔥ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం అప్లికేషన్ స్టేటస్ తెలుసుకొనుట :

  • ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నవారు వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకొని ఎందుకుగాను పోర్టల్ లో అవకాశం కల్పించారు.
  • విద్యార్థులు దరఖాస్తు నమోదు చేసుకున్న తర్వాత అప్లికేషన్ నెంబర్ లభిస్తుంది. విద్యార్థులు చేసుకున్న దరఖాస్తును బ్యాంకు వారు పరిశీలించి దరఖాస్తు స్టేటస్ను అప్డేట్ చేయడం జరుగుతుంది.
  • అప్లికేషన్ నెంబర్ ద్వారా విద్యాలక్ష్మి పోర్టల్ లోనే దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు.

🔥 ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం ముఖ్యాంశాలు :

  • ఈ పథకం ద్వారా అర్హత కలిగిన వారికి మూడు శాతం వడ్డీ సబ్సిడీ లభిస్తుంది.
  • రుణ మొత్తంలో 75% (7 లక్షల వరకు) క్రెడిట్ కచ్చితంగా లభిస్తుంది.
  • 860 ప్రధాన విద్యాసంస్థలలో చదువుతున్న వారికి ఈ పథకం ద్వారా కవరేజ్ కలిగి ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!