PGIMER చండీగఢ్ గ్రూప్ B & C ఉద్యోగాలు :
PGIMER (Postgraduate Institute of Medical Education & Research) , Chandigarh నుండి గ్రూప్ ‘B’ మరియు ‘C’ కేడర్‌లలో మొత్తం 114 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా PGIMER చండీగఢ్ మరియు PGI సాటిలైట్ సెంటర్, సంగ్రూర్ (పంజాబ్) లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేస్తున్న మొత్తం ఖాళీలు :
PGIMER Chandigarh లో 51 పోస్టులు :
- Jr. Technician (Lab): 31
- Jr. Technician (X-ray): 6
- Jr. Technician (Radiotherapy): 3
- OT Technician: 4
- Legal Assistant, Dental Hygienist, Assistant Dietician, Receptionist, Junior Auditor తదితరాలు
PGI Satellite Centre , Sangrur, Punjab లో 63 పోస్టులు :
- Nursing Officer: 51
- Store Keeper, Jr. Technician (Lab), UDC, LDC తదితర పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు :
పోస్టులను అనుసరించి విద్యార్హతలు ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు ఉండాల్సిన అర్హతలు వివరాలు క్రింద తెలిపిన విధంగా ఉండాలి. అభ్యర్థులు పూర్తి అర్హతల వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- నర్సింగ్ ఆఫీసర్ : B.Sc. Nursing లేదా డిప్లొమా జీఎన్ఎం, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదు
- Jr. Technician (Lab) : B.Sc. Medical Lab Technology
- OT Technician : B.Sc. (Operation Theatre Technology)
- Receptionist : డిగ్రీ + పబ్లిక్ రిలేషన్స్ డిప్లొమా
- Junior Auditor : B.Com with 2 years experience
- UDC/LDC : డిగ్రీ లేదా 12వ తరగతి, కంప్యూటర్ టైపింగ్ స్కిల్ ఉండాలి.
జీతం వివరాలు : (Pay Scale)
- గ్రూప్ B పోస్టులు : ₹35,400 – ₹1,42,400 (Level 6/7)
- గ్రూప్ C పోస్టులు : ₹19,900 – ₹81,100 (Level 2/4/5)
దరఖాస్తు ఫీజు వివరాలు :
- SC / ST అభ్యర్థులకు దరఖాస్తుఫీజు 800/- రూపాయలు + ట్రాన్సాక్షన్ ఛార్జెస్
- OBC / EWS / Gen : 1500/- రూపాయలు + ట్రాన్సాక్షన్ ఛార్జెస్
- PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక విధానం :
- Computer Based Test (CBT) – 100 మార్కులు
- 100 ప్రశ్నలు ఉంటాయి.
- ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
- ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కింగ్ విధానము అమలులో ఉంటుంది.
- అర్హత మార్కులు : Gen / EWS కి 40%, SC / ST / OBC కి 35%
- Skill Test (కొన్ని రకాల పోస్టులకు మాత్రమే స్కిల్ టెస్ట్ ఉంటుంది)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- ఫైనల్ మెరిట్ ఆధారంగా ఎంపిక
పరీక్ష కేంద్రాలు :
- హైదరాబాద్
- ఢిల్లీ / NCR
- కోల్‌కతా
- చండీగఢ్ / మొహాలి
PGIMER Recruitment ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం తేది : 04 జూలై 2025 నుండి అప్లై చేయవచ్చు.
- ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 04 ఆగస్టు 2025 తేది వరకు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
- అధికారిక వెబ్‌సైట్ : https://pgimer.edu.in
ఎలా అప్లై చేయాలి ? :
- https://pgimer.edu.in వెబ్‌సైట్ లోకి వెళ్ళండి.
- Recruitment → Apply Online → అప్లికేషన్ ఫారాన్ని పూరించండి
- అవసరమైన సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించి అప్లికేషన్‌ను సమర్పించండి.
అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు :
- అభ్యర్థులు ఒక్కసారి రిజిస్టర్ అయిన తరువాత, వివరాలు మార్చడం సాధ్యం కాదు. కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
- తప్పుగా అప్లై చేసిన అభ్యర్థులకు ఫీజు తిరిగి ఇవ్వబడదు.
- ఫోటోపై అభ్యర్థి పేరు మరియు తేదీ ఉండాలి.
🏹 Download Full Notification – Click here