ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్ (ONGC) 2623 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ పోస్టులకు అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2623 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్ (ONGC) నుండి విడుదల అయ్యింది.
భర్తీ చేస్తున్న పోస్టులు :
ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, సివిల్ ఎగ్జిక్యూటివ్, కెమిస్ట్, మెకానిక్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ మరియు ఇతర విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
భర్తీ చేస్తున్న మొత్తం అప్రెంటిస్ పోస్టుల సంఖ్య :
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్ (ONGC) విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 2623 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
విద్యార్హతలు :
పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటిఐ, డిప్లమో మరియు డిగ్రీ విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు వివరాలు :
కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.
వయసులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్ల వరకు సడలింపు ఇస్తారు.
- ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడేళ్ల వరకు సడలింపిస్తారు.
- PwBD అభ్యర్థులకు అదనంగా మరో 10 ఏళ్ల వరకు సడలింపు ఇస్తారు.
స్టైఫండ్ వివరాలు :
ఎంపికైన వారికి నెలకు 8200 నుండి 12,300 వరకు స్టైఫండ్ ఇస్తారు.
ఎంపిక విధానం వివరాలు :
అప్లై చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టు చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు..
ముఖ్యమైన తేదీల వివరాలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ : అక్టోబర్ 16
అప్లికేషన్ చివరి తేదీ : నవంబర్ 17
ఫలితాలు విడుదల తేదీ : నవంబర్ 26
గమనిక :
ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునేవారు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదివిన తర్వాత అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆన్లైన్లో అప్లై చేయండి. అప్లై లింక్స్ కూడా క్రిందన ఇవ్వబడినవి.
✅ Download Notification – Click here
