NSP Scholarship 2025 : ఆర్దికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు , మరియు ఇతర సంస్థలు అనేక స్కాలర్షిప్ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇలాంటి అనేక స్కాలర్షిప్స్ వివరాలు National Scholarship Portal (NSP) వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ పోర్టల్ లో ఒకటవ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ పథకాల వివరాలు ఉంటాయి. అర్హత ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పథకాలకు అప్లై చేసుకోవచ్చు.
మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా ఈ స్కాలర్షిప్ పథకాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకుంటారు.
✅ ఇలాంటి వివిధ విద్యా, ఉద్యోగాల సమాచారం మీ మొబైల్ కి రావాలి అంటే మా టెలిగ్రామ్ గ్రూపులో వెంటనే జాయిన్ అవ్వండి..
🏹 Join Our Telegram Group – Click here
NSP Scholarship Portal Details :
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వారు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ రూపొందించారు. ఈ వెబ్సైట్ రూపొందించడానికి ప్రధాన కారణం విద్యార్థులకు ఒకే చోట వివిధ స్కాలర్షిప్ లకు అప్లై చేసుకుని అవకాశం కల్పించడం కోసం.
NSP Scholarship 2025 కు ఎవరు అర్హులు :
- ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, ఈడబ్ల్యూఎస్, జనరల్, PWD ఇలా కేటగిరీలకు చెందిన విద్యార్థులు అందరూ ఈ స్కాలర్షిప్ పథకాలకు అర్హులు.
- 1వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ లకు అర్హులు.
✅ పదో తరగతి, ఇంటర్ అర్హతతో 1446 ఉద్యోగాలు – Click here
NSP Scholarship 2025 కు ఉండవలసిన ఇతర అర్హతలు :
- భారతీయ పౌరులై ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం రెండున్నర లక్షల నుండి 8 లక్షల లోపు ఉండాలి.
- ఒకటవ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పథకాలకు అర్హులు.
- గుర్తింపు పొందిన పాఠశాల లేదా కళాశాలలో చదువుతూ ఉండాలి.
NSP Scholarship 2025 పథకానికి అవసరమైన డాక్యుమెంట్స్ :
- ఆధార్ కార్డు.
- ఆధార్ తో లింక్ అయిన బ్యాంకు పాస్ బుక్.
- కుల ధ్రువీకరణ పత్రం
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికెట్లు
- పాఠశాల లేదా కళాశాల నుండి తీసుకున్న బోనఫైడ్ సర్టిఫికెట్.
- గత విద్యా సంవత్సరం మార్కుల సీటు.
- నివాస ధ్రువీకరణ పత్రం
- PWD అభ్యర్థులకు సంబంధిత సదరం సర్టిఫికెట్
- ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో
NSP Scholarship Portal లో ఉన్న వివిధ స్కాలర్షిప్ పథకాలు :
- కేంద్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖ, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖలు అందజేస్తున్న వివిధ స్కాలర్షిప్ పథకాలు వివరాలు ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు.
- వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్న స్కాలర్షిప్ పథకాలు వివరాలు కూడా ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
- UGC / AICTE విద్యార్థుల కోసం అందిస్తున్న ప్రగతి స్కాలర్షిప్, సాక్ష్యం స్కాలర్షిప్ వివరాలు కూడా ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
- ఇలా అన్ని రకాల స్కాలర్షిప్ పథకాలకు National Scholarship Portal నుండి అప్లై చేసుకోవచ్చు.
National Scholarship Portal లో ఎలా అప్లై చేయాలి :
- ముందుగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- అక్కడ ఉన్న న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి సూచనలు అన్ని చదివి అంగీకరించడానికి అక్కడ ఉన్న చెక్ బాక్స్ పై క్లిక్ చేయాలి.
- పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయాలి.
- ఇప్పుడు మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ కు యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ వివరాలు వస్తాయి. వాటిని ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
- లాగిన్ అయిన తర్వాత వివిధ స్కాలర్షిప్ల వివరాలు కనిపిస్తాయి. మీకు నచ్చిన స్కాలర్షిప్ పై క్లిక్ చేసి ఇక్కడ అడిగిన విద్య, వ్యక్తిగత మరియు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేయాలి.
- ఇప్పుడు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు.
🏹 Visit NSP Scholarship Portal – Click here
National Scholarship ద్వారా విద్యార్థులకు జరిగే లబ్ది :
- ఒకటి నుండి పదో తరగతి విద్యార్థులకు నెలకు 500/- నుండి 1000/- రూపాయలు వరకు స్కాలర్షిప్ వస్తుంది.
- 11 మరియు 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు 2000/- నుండి 3000/- రూపాయల వరకు స్కాలర్షిప్ వస్తుంది.
- డిగ్రీ లేదా పీజీ లేదా ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు వారి కోర్స్ ఆధారంగా సంవత్సరానికి 5000/- నుండి 20,000/- రూపాయల వరకు స్కాలర్షిప్ లు వస్తాయి.