NIMS Nursing Officer Notification 2025 : తెలంగాణ రాష్ట్రంలో గల హైదరాబాద్ నందు గల పంజాగుట్ట లో గల నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థ నందు కాంట్రాక్ట్ ప్రాధిపతికన పనిచేసేందుకు గాను పీడియాట్రిక్ రుమటాలజీ నర్స్ ఉద్యోగ భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారు క్లినికల్ ఇమ్యునాలజీ & రుమటాలజీ విభాగంలో పనిచేయవలసి వుంటుంది. కేవలం ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాన్ని పొందవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఇతర అంశాలు అనగా అవసరమగు విద్యార్హత ఏమిటి ? ఈ ఉద్యోగాలకు ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి లభించు జీతం ఎంత ? వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు..
Table of Contents
🔥Nursing Officer నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంస్థ :
- నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( NIMS ) సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేయు ఉద్యోగాలు :
- పెడియాట్రిక్ రుమటాలజీ నర్స్ ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు.
- ఈ ఉద్యోగానికి ఎంపిక అయిన వారు ఒక సంవత్సరం పాటు పనిచేసేందుకు గాను రిక్రూట్ చేస్తారు, అయితే అవసరాన్ని బట్టి విస్తరిస్తారు.
🔥 విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ / GNM ను ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అభ్యర్థులు తప్పనిసరిగా వ్యాలీడ్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
- బీఎస్సీ నర్సింగ్ / GNM ఉత్తీర్ణత ను ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ / స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ , యూనివర్సిటీ నుండి పొందివుండాలి.
- కనీసం ఒక సంవత్సరం క్లినికల్ ఎక్స్పీరియన్స్ కలిగి వుండాలి.
- పీడియాట్రిక్ / రుమటాలజీ కేర్ నందు పని అనుభవం కలిగి వున్న వారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.
✅ ఏదైనా డిగ్రీ అర్హతతో LIC లో 350 ఉద్యోగాలు – Click here
🔥 దరఖాస్తు చేయు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- నిమ్స్ అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- అభ్యర్థులు సంబంధిత దరఖాస్తు ఫారం ను ఫిల్ చేసి , సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి డీన్ , నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , పంజాగుట్ట , హైదరాబాద్ – 500082. కి అందజేయాలి.
- అప్లికేషన్ అందించటానికి 25/08/2025 సాయంత్రం 04:00 గంటల వరకు అవకాశం కల్పించారు.
🔥ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూ ను డీన్ వారి కార్యాలయం , నిమ్స్ , హైదరాబాద్ నందు నిర్వహిస్తారు.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక కాపడిన వారికి ప్రతినెలా 30 వేల రూపాయలు కన్సాలిడేటెడ్ పే గా లభిస్తాయి.
🔥 ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 25/08/2025 ( సాయంత్రం 04:00 గంటల లోగా)
👉 CLICK HERE FOR NOTIFICATION & APPLICATION