NHAI Jobs Notification 2025 : భారత ప్రభుత్వ రోడ్డు ట్రాన్స్పోర్ట్ మరియు హైవేస్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అక్టోబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 15వ తేదీలకు అప్లై చేయాలి.
డ ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తిగా చదివిన తర్వాత అర్హత ఉన్న వారికి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ రోడ్డు ట్రాన్స్పోర్ట్ మరియు హైవీస్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నుండి విడుదల కావడం జరిగింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
NHAI విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ మరియు అకౌంట్స్) , లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, అకౌంటెంట్ మరియు స్టెనోగ్రాఫర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
భర్తీ చేస్తున్న మొత్తం ఉద్యోగాల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 84 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత వివరాలు :
క్రింది తెలిపిన విధంగా విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.

ఎంపిక విధానం :
పోస్టులను అనుసరించి ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ వంటి పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ విధానం :
అర్హత ఉండేవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న నిరుద్యోగులు తమ దరఖాస్తులను అక్టోబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 15వ తేదీలోపు సబ్మిట్ చేయాలి.
వయస్సు వివరాలు :
స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలలోపు ఉండాలి. మిగతా అన్ని రకాల ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.
వయసులో సడలింపు వివరాలు :
భారత ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు, ఓబిసి అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు, PWD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు..
UR, OBC, EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 500/- రూపాయలు
✅ Download Notification – Click here
